Covid Omicron Variant: US Govt New Rules To International Travelers - Sakshi
Sakshi News home page

అమెరికా వెళ్తున్నారా? ఈ రూల్స్‌ పాటించాల్సిందే ! బైడెన్‌ సర్కార్‌ కొత్త ఆదేశాలు

Published Fri, Dec 3 2021 1:36 PM | Last Updated on Fri, Dec 3 2021 9:21 PM

Amid Omicron Fears US Govt Orders New Rules To International Travelers Entering To USA - Sakshi

ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం నిబంధనలు కఠినం చేసింది. విదేశాల నుంచి అమెరికా చేరుకునే ఆ దేశ పౌరులు, విదేశీయులు తప్పనిసరిగా కొన్ని నిబందనలు పాటించాలంటూ జో బైడెన్‌ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

గత బుధవారం కాలిఫోర్నియాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసు వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన అమెరికా ఆరోగ్య , వైద్య విభాగం వెంటనే ప్రభుత్వానికి కొన్ని సూచనలు జారీ చేసింది. వీటి ప్రకారం విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించారు.
- విదేశాల నుంచి అమెరికాకు చేరుకునే వారు తమతో పాటు 24 గంటల ముందు జారీ చేసిన  కోవిడ్‌ నెగటివ్‌ సర్టిఫికేట్‌ చూపించాల్సి ఉంటుంది. గతంలో 72 గంటలుగా ఉన్న నిబంధనను ఒక రోజుకి కుదించారు. 
- గడిచిన పద్నాలుగు రోజులుగా దక్షిణాఫ్రికాతో పాటు ఒమిక్రాన్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రయాణించిన వారికి అమెరికాలోకి ఎంట్రీ లేదు. అయితే అమెరికన్‌ సిటిజన్లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.
- విమానాశ్రయాల్లో కోవిడ్‌ టెస్టులకు తప్పనిసరిగా హాజరు కావాలి
- విమానంతో పాటు బస్సు, రైలు, క్యాబ్‌లలో సైతం మాస్కు ధరించాలనే నిబంధన అమల్లోకి తెచ్చారు. మార్చి 18 వరకు ఈ రూల్‌ కొనసాగుతుంది. 

చదవండి: ముంబై మీదుగా వచ్చే ఎన్నారైలకు అలెర్ట్ ! మహా సర్కారు కొత్త నిబంధనలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement