
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 12 కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ తీవ్రత ఉన్న దేశాల నుంచి వచ్చిన ముగ్గురికి, తీవ్రత లేని దేశాల నుంచి వచ్చిన తొమ్మిది మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం పేర్కొంది.
తాజాగా నమోదైన 12 కేసులతో తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 79కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య 52కు చేరింది. మరోవైపు కరోనా కేసులు సంఖ్య కూడా పెరుగుతోంది. శనివారం కొత్తగా 317 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యశాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment