దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. దేశంలో తాజాగా 2,71,202 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో 314 మంది మృతి చెందారు.
శనివారంతో(జనవరి 15) పోలిస్తే పెరిగిన కేసుల సంఖ్య 2,369గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 15,50,377గా ఉంది. మరోవైపు కేసుల పాజిటివ్ రేటు 16.28%గా ఉంది. ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 7,743గా నమోదు అయ్యింది. వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 156.76 కోట్లు పూర్తి చేసుకుంది. గత ఇరవై నాలుగు గంటల్లో 66 లక్షల డోసుల‍్ని అందించారు. ముంబై నగరంలో జనవరి 15న పది వేల కొత్త కేసులు, 11 మరణాలు సంభవించాయి.
వ్యాక్సినేషన్‌కి ఏడాది పూర్తి
#1YearOfVaccineDrive.. భారత్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్షుక్ మాండవియా ప్రకటించారు.
आज विश्व के सबसे बड़े टीकाकरण अभियान को 1 वर्ष पूर्ण हो गया है।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 16, 2022
PM @NarendraModi जी के नेतृत्व में शुरू हुआ यह अभियान 'सबके प्रयास' के साथ आज दुनिया का सबसे सफल टीकाकरण अभियान है।
मैं सभी स्वास्थ्य कर्मियों, वैज्ञानिकों व देशवासियों को बधाई देता हूँ। #1YearOfVaccineDrive pic.twitter.com/IvoX3Z9Nso
Comments
Please login to add a commentAdd a comment