
సాక్షి, న్యూఢిల్లీ: ఒమిక్రాన్ భయాలతో వణికిపోతున్న తరుణంలో ఢిల్లీకి చెందిన వైద్య నిపుణులు ఊరటనిచ్చే విషయం చెప్పారు. ఇప్పటివరకు మనదేశంలో ఒమిక్రాన్ సోకిన వారిలో దాదాపు 90శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవని, వారికి చికిత్సలు కూడా అందించాల్సిన అవసరం లేదని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సురేష్ తెలిపారు. ఒమిక్రాన్ వచ్చిన తరువాత త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారని చెప్పారు.
(చదవండి: లాక్‌డౌన్‌పై ఆరోగ్య శాఖ కీలక వ్యాఖ్యలు)
తగ్గిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
రోజూ పెద్ద మొత్తంలో వెలుగుచూస్తున్న ఒమిక్రాన్ కేసుల్లో కొద్దిగా తగ్గుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7 కేసులు మాత్రమే రికార్డయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 422 కు చేరగా.. బాధితుల్లో ఇప్పటివరకు 130 మంది కోలుకున్నారని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఆదివారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. ఇక గడిచిన 24 గంటల్లో 6,987 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల్లో 7,091 మంది తాజాగా కోలుకున్నారు. వైరస్ బాధితుల్లో మరో 162 మంది ప్రాణాలు కోల్పోయారు.
(చదవండి:12 ఏళ్లు పైబడిన పిల్లలకు కోవాగ్జిన్!)
Comments
Please login to add a commentAdd a comment