
ముంబై: ‘ఇండియా ఇంటర్నేషనల్ జ్యులయరీ షో సిగ్నేచర్’ (ఐఐజేఎస్)ను వాయిదా వేస్తున్నట్టు జెమ్ అండ్ జ్యులయరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ప్రకటించింది. జవనరి 6 నుంచి 9 వరకు ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించాలని లోగడ జీజేఈపీసీ నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనా పరిస్థితులను దృష్టిలో పెంచుకుని వాయిదా వేసినట్టు జీజేఈపీసీ చైర్మన్ కొలిన్‌షా తెలిపారు. ప్రదర్శనకు అన్ని అనుమతులు లభించాయని, ప్రదర్శనదారులు, దేశ, విదేశాల నుంచి వచ్చే కొనుగోలు దారులు, సభ్యులు, సహచరులతో మాట్లాడిన తర్వాత వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment