సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల ఒక విదేశీయుడి నుంచి హైదరాబాద్ కార్పొరేట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్‌కు ఒమిక్రాన్ సోకగా ఆదివారం ఫలితాల్లో ఆ వైద్యుడి భార్యకూ ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొదటిసారి ఒమిక్రాన్ రెండో కాంటాక్ట్‌కు కూడా వ్యాపించినట్లు తేలింది. ఇది ప్రమాదకరమైన పరిణామమని వైద్యులు చెబుతున్నారు. ఆ డాక్టర్ భార్యతో సహా ఆదివారం రాష్ట్రంలో 3 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఆమెతో కాంటాక్ట్‌లో ఉన్న వారందరినీ క్వారంటైన్‌లో ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది.
(చదవండి: 15–18 ఏళ్ల పిల్లలందరికీ టీకాలు.. హైదరాబాద్‌కు ఊరట)
ఒమిక్రాన్ సోకిన ఇద్దరిలో ఒకరు సోమాలియా దేశస్తుడు కాగా మరొకరు కెన్యా వ్యక్తి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 44కు పెరిగింది. ఇందులో 10 మంది రికవర్ అయ్యారు. కాగా ఆదివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 248 మంది రాగా వీరిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఈ ఇద్దరిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందా? లేదా? గుర్తించేందుకు ప్రయోగశాలకు వీరి నమూనాలను పంపారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 109 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,80,662కు పెరిగింది. కరోనాతో ఒకరు మృతిచెందగా.. ఇప్పటి వరకు మొత్తం 4,022 మంది మృతిచెందారు.
(చదవండి: కేపీహెచ్‌బీ కాలనీ.. హాస్టల్‌లో యువతి ఆత్మహత్య )
Comments
Please login to add a commentAdd a comment