సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా మరో 4 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7కు చేరింది. ఇవాళ నమోదైన కేసుల్లో ముగ్గురు కెన్యా దేశానికి చెందిన వారు కాగా.. మరొకరు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అని వైద్యాధికారులు చెప్పారు. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరగడంతో తెలంగాణ ఆరోగ్య శాఖ అలెర్ట్ అయింది. ఇప్పటికే రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైన టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. భారత్‌లో మొత్తంగా ఒమిక్రాన్ కేసులు 87కి చేరుకున్నాయి.
చదవండి: (ఆ ఇమ్యూనిటీతో ఎదుర్కోవచ్చు)
Comments
Please login to add a commentAdd a comment