సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 మరణాల్లో స్పష్టత ఉండటం లేదన్న విమర్శల నేపథ్యంలో ఢిల్లీ రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన ఓ ట్రక్ డ్రైవర్ (70) మరణించగా, డెత్ సర్టిఫికెట్‌లో మాత్రం మరణానికి దారితీసిన కారణం గుండెపోటుగా పేర్కొన్నారు. ఢిల్లీలోని ఖజౌరి ప్రాంతానికి చెందిన ట్రక్ డ్రైవర్ మే 4న మరణించగా, మే 2న రాంమనోహర్ లోహియా ఆస్పత్రి నుంచి అతడికి కరోనా పాజిటివ్‌గా నివేదిక వచ్చింది. అయితే రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వర్గాలు ఆయన డెత్ సర్టిఫికెట్‌లో మరణానికి కరోనా వైరస్‌ను కారణంగా చూపలేదు.
కార్డియోపల్మనరీ అరెస్ట్ కారణంగా మరణించాడని మరణ ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకినా దాని గురించి ఆస్పత్రి వర్గాలు డెత్ సర్టిఫికెట్‌లో చూపలేదు. మరోవైపు బాధితుడు హిమాచల్ ప్రదేశ్‌లోనూ ట్రక్కులు నడిపే క్రమంలో 2008లో హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలినట్టు వెల్లడైంది. ఇక కరోనా వైరస్ సమాచారంలో ఢిల్లీ ప్రభుత్వం గోప్యత పాటిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. ఇక ఢిల్లీలో కరోనా వైరస్‌తో ఇప్పటివరకూ 129 మంది మరణించగా, పాజిటివ్ కేసుల సంఖ్య 9,333కు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment