న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ బారినపడి, చికిత్సతో కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసులు 14,83,156 కాగా, 9,52,743 మంది పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి ఇళ్లకు చేరుకున్నారు. అంటే 64.24 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. రికవరీ రేటు 40 రోజుల క్రితం 53 శాతంగా ఉండేది. కరోనా మరణాల రేటు కూడా రోజురోజుకూ తగ్గిపోతోంది. జూన్ 18న 3.33 శాతం కాగా, ప్రస్తుతం 2.25 శాతంగా నమోదైంది.
ఇతర దేశాలతో పోలిస్తే ఇది స్వల్పమే కావడం సానుకూలాంశం. కరోనా కొత్త కేసులు, మరణాలు కొంత తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 24 గంటల్లో కొత్తగా 47,703 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 654 మంది బాధితులు మరణించారు. దేశంలో మొత్తం మరణాలు 33,425కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలియజేసింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,96,988.
కడుపులో బిడ్డకూ కరోనా
మహారాష్ట్రలోని పుణే నగరంలో కరోనా బాధితురాలైన తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ కూడా వైరస్ బారినపడింది. ససూన్ జనరల్ ఆసుపత్రిలో మే నెల చివరి వారంలో ఈ ఘటనలో చోటుచేసుకుంది. ఈ తరహా కేసు భారత్‌లో ఇదే మొదటిదని వైద్యులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment