కోవిడ్ టెస్టుల కోసం లాస్‌ఏంజెలిస్‌లోని డాడ్జర్ స్టేడియం వద్ద బుధవారం రాత్రి కార్లలో వేచి ఉన్న ప్రజలు
ఢిల్లీ : కరోనా వేవ్‌లతో పాశ్చాత్య దేశాలు వణికిపోతున్నాయి. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా బాధితులకు వైద్యం అందించడం ఆయా దేశాలకు పెను సవాల్‌గా మారడంతో విదేశీయులను వారి మాతృ దేశాలకు పంపిస్తున్నాయి. ఢిల్లీలో కరోనాతో రికార్డు స్థాయిలో ఒకేరోజు 131 మంది చనిపోయారు. కొన్ని మార్కెట్లు మూసివేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించగా తాజాగా మాస్కులు లేకుండా ప్రజలు బయట సంచరిస్తే రూ.2,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఢిల్లీలో రెండో దశను కూడా దాటి మూడో దశకు వైరస్ వ్యాప్తి చేరుకున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. మిగతా రాష్ట్రాల్లోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
గుజరాత్‌లో పంచాయతీ ఎన్నికలు వాయిదా...
కోవిడ్ సెకండ్ వేవ్ భయాందోళనల నేపథ్యంలో గుజరాత్‌లో పంచాయితీ ఎన్ని కలను వాయిదా వేయడం గమనార్హం. అమెరికాలో కేసులు తగ్గక పోవ డంతో లాస్ ఏంజెలిస్‌లో మొదటిసారి రాత్రిపూట కర్ఫూ విధించడంతో పాటు.. మూడు వారాల లాక్‌డౌన్ దిశగా సన్నద్ధమవు తున్నారు. యూకే లాంటి దేశాల్లో క్రిస్మస్ వేడుకలను 5 రోజులకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ టీకాను ఆవిష్కరించినా మన దేశ పరిస్థితులకు అది ఎంతమేర సరిపోతుందనే సందేహాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment