సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 43 లక్షలకు చేరువవగా, మరణాల రేటు దిగిరావడం సానుకూల పరిణామమని అధికారులు పేర్కొన్నారు. ఆగస్ట్ తొలి వారంలో కరోనా మహమ్మారి బారినపడి మరణించేవారి సంఖ్య 2.15 శాతం ఉండగా, ఇప్పుడది ఏకంగా 1.7 శాతానికి దిగివచ్చిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5000లోపు కోవిడ్-19 కేసులున్నాయని, లక్షద్వీప్‌లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదని వెల్లడించారు.
దేశంలో 62 శాతం కరోనా యాక్టివ్ కేసులు కేవలం 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయని చెప్పారు. 70 శాతం మరణాలు కూడా ఈ రాష్ట్రంలోనే చోటుచేసుకున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతితక్కువగా భారత్‌లో ప్రతి పదిలక్షల మందిలో 3102 కోవిడ్-19 కేసులే వెలుగుచూశాయని చెప్పారు. రష్యా కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోందని భారత్‌లో తయారీ, మూడో దశ పరీక్షల కోసం రష్యా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిందని నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. చదవండి : మాల్స్ తెరచినప్పుడు కోర్టులు తెరవడం తప్పా?
Comments
Please login to add a commentAdd a comment