సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రికార్డుస్ధాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నా మహమ్మారి నుంచి కోలుకునేవారి సంఖ్య గణనీయంగా పెరగడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 73,642 మంది కోవిడ్-19 రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 32,00,000 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 77.32 శాతానికి పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. మరోవైపు కోవిడ్-19 మరణాల రేటు 1.72 శాతానికి తగ్గడం సానుకూల పరిణామమని పేర్కొంది.
కోవిడ్-19 నుంచి కోలుకునే రోగుల సంఖ్య రోజూ పెరుగుతోందని, గత రెండురోజులుగా రోజుకు 70,000 మందికి పైగా ఈ వ్యాధి నుంచి కోలుకుంటున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా టెస్టులను ముమ్మరం చేయడంతో ప్రాథమిక దశలోనే కోవిడ్-19ను గుర్తించి చికిత్స అందించడం ద్వారానే సానుకూల ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 90632 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 1065 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి : వ్యాక్సిన్ పంపిణీ ఇలా..
Comments
Please login to add a commentAdd a comment