సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నివారణకు ఉపయోగించే యాంటీ వైరల్ ఔషధం ‘రెమ్‌డెసివిర్’ తయారీ, మార్కెట్ చేయడానికి ఫార్మాస్యూటికల్ మేజర్ మైలాన్ లాబ్స్‌కు అనుమతి లభించింది. అమెరికా పార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్‌కు చెందిన ఈ ఔధషం తయారీకి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) మైలాన్‌కు అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. (కరోనా టీకా: మరో కీలక అడుగు)
కరోనాతో ఆసుపత్రిలో చేరిన రోగులకు అత్యవసర వినియోగానికి మాత్రమే ఉపయోగించాలన్న ఆంక్షలతో యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ తయారీకి, మార్కెటింగ్‌కు మైలాన్‌కు అవకాశం దక్కింది. తాజా అనుమతితో ఔషధ తయారీకి మైలాన్ శరవేగంగా సన్నద్ధమవుతోంది. దీంతో దేశంలో మూడు కంపెనీలకు ఈ ప్రయోగాత్మక ఔషధాన్ని తయారు చేసి విక్రయించే అధికారం లభించింది. మిగతా రెండు కంపెనీలు హెటిరో, సిప్లా. (కరోనా కీలక మందు : అమెరికా అద్భుత డీల్)
కాగా గిలియడ్ సైన్సెస్ యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ మార్కెటింగ్‌కు సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది. దీంతో రెమ్‌డెసివిర్‌ను తయారు చేసి పంపిణీ చేయడానికి మైలాన్‌తో పాటు సిప్లా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, హెటిరో, బీఆర్‌డీ అనే ఐదు ఫార్మా సంస్థలతో గిలియడ్ నాన్-ఎక్స్‌క్లూజివ్ స్వచ్ఛంద లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment