Mylan Laboratories
-
కరోనా : శుభవార్త చెప్పిన మైలాన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దేశీయ ఫార్మా సంస్థ మైలాన్ కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ నెలలోనే రెమ్‌డెసివిర్‌కు తమ జనరిక్ వెర్షన్ ఔషధాన్ని విడుదల చేయనున్నామని సోమవారం ప్రకటించింది. (రెమ్‌డెసివిర్ : మైలాన్‌కు అనుమతి) దేశంలో వినియోగానికి ‘డెస్రెం’ పేరుతో ఈ ఔషధాన్ని విడుదల చేయనున్నట్లు మైలాన్ తెలిపింది. గిలియడ్ సైన్సెస్ కుచెందిన యాంటీ వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ జనరిక్ వెర్షన్ డ్రగ్‌ను 100 మిల్లీగ్రాముల డోస్‌కు 4,800 రూపాయలు (64.31డాలర్లు) చొప్పున ఈ నెలలోనే విడుదల చేస్తామని ప్రకటించింది. ‘డెస్రెం’ పేరుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిందని మైలాన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (కరోనా కీలక మందు : అమెరికా అద్భుత డీల్) కాగా సిప్లా లిమిటెడ్, హెటెరో ల్యాబ్స్ లిమిటెడ్ రెమ్‌డెసివిర్ జనరిక్ వెర్షన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. సిప్లాకు చెందిన సిప్రెమిని 5,000 రూపాయల కన్నా తక్కువ ధరకే అందివ్వనుండగా, హెటెరో కోవిఫోర్ ఔషధం ధరను 5,400 రూపాయలకు నిర్ణయించింది. మరోవైపు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ప్రపంచంలోని కరోనా ప్రభావానికి గురైన దేశాల్లో మూడవ స్థానంలో ఉన్న ఇండియాలో సోమవారం నాటికి 697,413 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, మరణించిన వారి సంఖ్య 20వేలకు చేరువలో ఉంది. -
రెమ్‌డెసివిర్ : మైలాన్‌కు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నివారణకు ఉపయోగించే యాంటీ వైరల్ ఔషధం ‘రెమ్‌డెసివిర్’ తయారీ, మార్కెట్ చేయడానికి ఫార్మాస్యూటికల్ మేజర్ మైలాన్ లాబ్స్‌కు అనుమతి లభించింది. అమెరికా పార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్‌కు చెందిన ఈ ఔధషం తయారీకి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) మైలాన్‌కు అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. (కరోనా టీకా: మరో కీలక అడుగు) కరోనాతో ఆసుపత్రిలో చేరిన రోగులకు అత్యవసర వినియోగానికి మాత్రమే ఉపయోగించాలన్న ఆంక్షలతో యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ తయారీకి, మార్కెటింగ్‌కు మైలాన్‌కు అవకాశం దక్కింది. తాజా అనుమతితో ఔషధ తయారీకి మైలాన్ శరవేగంగా సన్నద్ధమవుతోంది. దీంతో దేశంలో మూడు కంపెనీలకు ఈ ప్రయోగాత్మక ఔషధాన్ని తయారు చేసి విక్రయించే అధికారం లభించింది. మిగతా రెండు కంపెనీలు హెటిరో, సిప్లా. (కరోనా కీలక మందు : అమెరికా అద్భుత డీల్) కాగా గిలియడ్ సైన్సెస్ యాంటీ-వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ మార్కెటింగ్‌కు సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది. దీంతో రెమ్‌డెసివిర్‌ను తయారు చేసి పంపిణీ చేయడానికి మైలాన్‌తో పాటు సిప్లా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, హెటిరో, బీఆర్డీ అనే ఐదు ఫార్మా సంస్థలతో గిలియడ్ నాన్-ఎక్స్‌క్లూజివ్ స్వచ్ఛంద లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
తెవా ‘కొనుగోలు’ ఆఫర్‌కు మైలాన్ నో
‘క్యాష్ అండ్ స్టాక్’ ప్రతిపాదన తగినంత లేదని వివరణ న్యూయార్క్: ఇజ్రాయిల్ కేంద్రంగా పనిచేస్తున్న తెవా 40.1 బిలియన్ డాలర్ల కొనుగోలు ఆఫర్‌ను యూకే అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ మైలాన్ లాబొరేటరీస్ తిరస్కరించింది. తెవా ‘క్యాష్-అండ్-స్టాక్’ ప్రతిపాదన మైలాన్ విలువను తక్కువగా చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. షేర్‌కు 82 డాలర్ల చొప్పున తెవా ‘బయ్‌అవుట్’ ఆఫర్ ఇచ్చింది. తాజా తిరస్కృతి నేపథ్యంలో... మరో ఆఫర్‌కు మైలాన్ తలుపులు తెరిచే ఉంటున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తొలి ఆఫర్ ప్రకారం అప్పటి మైలాన్ షేర్ ధరతో పోల్చితే తెవా ఆఫర్ 21 శాతం అధికం. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో మైలాన్ షేర్ ధర 3.56 డాలర్లు పతనమై (4.7 శాతం) 72.50 డాలర్లుకు తగ్గింది. నేపథ్యం ఇదీ... ఈ వారం మొదట్లో మైలాన్‌ను బలవంతంగా కొనుగోలు చేయడానికి తెవా ఫార్మా ఏకంగా 40.1 బిలియన్ డాలర్ల ఆఫర్ ఇవ్వటంతో సంచలనం మొదలైంది. అయితే ఈ బిడ్‌ను తప్పించుకోడానికి మైలాన్ మొదటినుంచీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగానే అమెరికన్ ఫార్మా దిగ్గజం పెరిగోను కొనుగోలు చేయడానికి మైలాన్ లాబొరేటరీస్ రంగంలోకి దిగిందని సంబంధిత వర్గాల కథనం. ఒకవేళ పెరిగోను మైలాన్ కొనుగోలు చేస్తే ఈ రెండింటినీ కలిపి కొనేంత శక్తి తెవాకు ఉండదు. ఈ ఆలోచనతో 29 బిలియన్ డాలర్లకు పెరిగోను కొనుగోలు చేసేలా... ఆ కంపెనీ షేర్ హోల్డర్లకు మైలాన్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ మేరకు... పెరిగో కంపెనీ వాటాదార్లకు ఒకో వాటాకు 60 డాలర్లతో పాటు మైలాన్‌కు చెందిన 2.2 షేర్లు కూడా ఇస్తారు. దీనిప్రకారం ఒకో పెరిగో షేరుకు 222.12 డాలర్లు చెల్లించినట్లవుతుంది. అయితే పెరిగో యాజమాన్యం మాత్రం ఈ బిడ్ చాలా తక్కువని దీనిని తిరస్కరించింది. తెవా ఆఫర్ వల్లే మైలాన్ షేరు ధర బాగా పెరిగిందని, ఆ పెరిగిన ధర ప్రకారం మైలాన్‌కు చెందిన రెండు షేర్ల విలువను లెక్కిస్తున్నారు తప్ప ఆఫర్‌కన్నా ముందు మైలాన్ ధరను పరిగణనలోకి తీసుకోవటం లేదని పెరిగో పేర్కొంది. తమ కంపెనీకి ఉన్న భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఈ ధర చాలా తక్కువని వివరించింది. ‘యాంటీట్రస్ట్’ అభ్యంతరాలతో రెగ్యులేటర్లు తెవా ఆఫర్‌ను తిరస్కరించే అవకాశం ఉందని కూడా మైలాన్ అంతక్రితం ప్రకటించడం గమనార్హం. -
పెరిగో కంపెనీకి మైలాన్ ఆఫర్
- తెవా బిడ్‌ను తప్పించుకోవటానికి వ్యూహం - 31.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు ఆఫర్ న్యూయార్క్: అమెరికన్ ఫార్మా దిగ్గజం పెరిగోను కొనుగోలు చేయడానికి యూకే అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ మైలాన్ లాబొరేటరీస్ రంగంలోకి దిగింది. 31.2 బిలియన్ డాలర్లకు పెరిగోను కొనుగోలు చేసేలా... ఆ కంపెనీ షేర్ హోల్డర్లకు ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ మేరకు... పెరిగో కంపెనీ వాటాదార్లకు ఒకో వాటాకు 60 డాలర్లతో పాటు మైలాన్‌కు చెందిన 2.2 షేర్లు కూడా ఇస్తారు. దీనిప్రకారం ఒకో పెరిగో షేరుకు 222.12 డాలర్లు చెల్లించినట్లవుతుంది. ప్రస్తుతం నాస్డాక్లో పెరిగో షేరు ధర 192 డాలర్ల వద్ద ఉండగా తాజా ఆఫర్ 30 డాలర్లు ఎక్కువ కావటం గమనార్హం. అయితే పెరిగో యాజమాన్యం మాత్రం ఈ బిడ్ చాలా తక్కువని వాదిస్తోంది. మైలాన్‌ను 40 బిలి యన్ డాలర్లకు కొనుగోలు చేస్తామంటూ ఇజ్రాయెల్ ఫార్మా దిగ్గజం తెవా ఫార్మా 5 రోజుల కిందట ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆఫర్ వల్లే మైలాన్ షేరు ధర బాగా పెరిగిం దని, ఆ పెరిగిన ధర ప్రకారం మైలాన్‌కు చెం దిన రెండు షేర్ల విలువను లెక్కిస్తున్నారు తప్ప ఆఫర్‌కన్నా ముందు మైలాన్ ధరను పరిగణనాలోకి తీసుకోవటం లేదని పెరిగో పేర్కొం టోంది. తమ కంపెనీకి ఉన్న భవిష్యత్‌ను దృష్టి లో పెట్టుకుంటే ఈ ధర చాలా తక్కువంటోంది. జరిగింది ఇదీ.. ఈ వారం మొదట్లో మైలాన్‌ను బలవంతంగా కొనుగోలు చేయడానికి తెవా ఫార్మా ఏకంగా 40.1 బిలియన్ డాలర్ల ఆఫర్ ఇవ్వటంతో సంచలనం మొదలైంది. దీన్ని తప్పించుకోవటానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే మైలాన్ ఈ పెరిగో డీల్‌కు తెరలేసింది. ఒకవేళ పెరిగోను మైలాన్ కొనుగోలు చేస్తే ఈ రెండిం టినీ కలిపి కొనేంత శక్తి తెవాకు ఉండదు. మైలాన్ తాజా ప్రతిపాదన చేయక ముందువరకూ తెవా ఆఫర్ బాగానే కనిపించినా... ఇపుడు మాత్రం కళ తప్పినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. -
మైలాన్ చేతికి ఫామీ కేర్
ఒప్పందం విలువ సుమారు రూ. 5,000 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహిళల ఆరోగ్య ఉత్పత్తులను అందించే ఫామీకేర్ వ్యాపారాన్ని మైలాన్ లేబొరేటరీస్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 5,000 కోట్లని మైలాన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. జనరిక్ ఓరల్ కాంట్రాసెప్టివ్ ప్రోడక్ట్స్(ఓసీపీ)లో అంతర్జాతీయ లీడర్‌గా ఉన్న ఫామీ కేర్‌ను 750 మిలియన్ డాలర్లతో భవిష్యత్తు చెల్లింపులు ఏమైనా ఉంటే గరిష్టంగా 50 మిలియన్ డాలర్లు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు మైలాన్ తెలిపింది. ముంబై కేంద్రంగా 1999లో ప్రారంభమైన ఫామీ కేర్ మహిళల గర్భనిరోధక మాత్రలు, మహిళలు వినియోగించే గర్భనిరోధక సాధనాల తయారీ సరఫరాలో అంతర్జాతీయంగా మొదటి స్థానంలో ఉంది. ఈ ఒప్పందంతో అమెరికా, యూరోప్ మహిళా హెల్త్‌కేర్ విభాగంలోకి చొచ్చుకుపోగలమన్న ధీమాను మైలాన్ సీఈవో హెదర్ బ్రెష్ సంతోషం వ్యక్తం చేశారు. యూరోప్ ఫామీకేర్తో 2008 నుంచి కలిసి పనిచేస్తున్నామని, ఫామీకేర్కు చెందిన 900 మంది ఉద్యోగులను మైలాన్లోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గర్భనిరోధక మాత్రలు వాడే మహిళల్లో 15 శాతం మంది ఫ్యామీ కేర్ ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు మైలాన్ పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో డీల్ పూర్తి కాగలదని హెదర్ చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మా ట్రిక్స్ లాబొరేటరీస్ను 2007లో మైలాన్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.