న్యూఢిల్లీ: చైనా, వియత్నాం దేశాలను వెనక్కి నెట్టేసి.. భారత్ ప్రపంచంలోనే అత్యంత చౌక తయారీ కేంద్రంగా అవతరించింది. ఈ విషయాన్ని యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ప్రకటించింది. మొత్తం 85 దేశాలకు గాను, మెరుగైన దేశంగా భారత్ 31వ ర్యాంకును సొంతం చేసుకుంది. వ్యాపార స్వేచ్ఛ విషయంలో 37వ స్థానాన్ని ఆక్రమించింది.
తయారీ వ్యయాల పరంగా భారత్ 100 స్కోరు సాధించింది. పన్నుల పరంగా అనుకూలతలో 100కు గాను 16.2 స్కోరు లభించింది. అవినీతి రహితంలో 18.1 స్కోరు, పారదర్శక ప్రభుత్వ విధానాల విషయంలో 3.5 స్కోరు మాత్రమే సాధించింది. ఆదాయం సమానత్వంలో 1.9, భద్రతలో 4.3 శాతం స్కోరు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment