
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. దేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇటీవల రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన తర్వాత చాలా మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది యూజర్లను ఆకట్టుకునేందుకు ఏడాదిపాటు ప్రయోజనాలు అందించే చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది.
చౌకైన రీఛార్జ్ ప్లాన్
బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 1,198. ఈ రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటు 365 రోజులు లేదా 12 నెలలు. ఇక ఇతరర ప్రయోజనాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కు అయినా కాల్ చేయడానికి వినియోగదారులకు ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు లభిస్తాయి. అలాగే ప్రతి నెలా 3GB హై స్పీడ్ 3G/4G డేటాను పొందుతారు. ఇది మాత్రమే కాదు.. ఈ ప్లాన్‌లో ప్రతి నెలా 30 ఉచిత SMSల సౌకర్యాన్ని కూడా ఆనందివచ్చు.
ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బీఎస్‌ఎన్‌ఎల్.. మరో మైలురాయి!
ధర తగ్గిన మరో ప్లాన్
కొత్త ప్లాన్‌ను ప్రారంభించడంతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్ తన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్‌లలో మరొకదాని ధరను కూడా తగ్గించింది. రూ. 1999 ప్లాన్ ధరను రూ. 100 తగ్గించి ఇప్పుడు రూ. 1899కే అందిస్తోంది. ఈ ప్లాన్ బెనిఫిట్స్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజువారీ పరిమితి లేకుండా మొత్తం 600GB డేటా, ప్రతిరోజూ 100 ఉచిత SMS వంటి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment