అతి చవకైన స్మార్ట్‌ టీవీ లాంచ్‌ | Mitashi launches cheapest curved Smart LED TV in India | Sakshi
Sakshi News home page

అతి చవకైన స్మార్ట్‌ టీవీ లాంచ్‌

Published Tue, Aug 15 2017 12:59 PM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

అతి చవకైన  స్మార్ట్‌ టీవీ లాంచ్‌

అతి చవకైన స్మార్ట్‌ టీవీ లాంచ్‌

న్యూడిల్లీ: మితాషి కంపెనీ  అతి చవకైన  స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది.  తన పోర్ట్‌ఫోలియోను విస్తరించుకునే ప్రణాళికలో భాగంగా   కొత్త ఉత్ప్త్తులను  మార్కెట్లో పరిచయం చేస్తోంది.  ఈ క్రమంలో 32, 39 అంగుళాల స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీలకు వినియోగదారులకు  భారతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. 
 
32 అంగుళాల  స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీ ధరను రూ. 22,990గాను, 39 అంగుళాల స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీధరను రూ. 39,990గా ను నిర్ణయించింది. ఇవి రెండూ ఆన్‌లైన్‌ రీటైలర్‌ అమెజాన్‌లో ప్రత్యేకంగా లభించనున్నాయి. అమెజాన్‌ లో ప్రత్యేక ఆఫర్‌లో రూ. 20,990, రూ. 34,990 ధరలకే  విక్రయిస్తోంది.  అలాగే దేశీయంగా ఆఫ్‌లైన్‌  స్టోర్లలో కూడా అందుబాటులో  ఉన్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మూడు సంత్సరాల వ్యారెంటీ కూడా అందిస్తోంది. 
 
ఇక ఫీచర్ల విషయానికి వస్తే...ఆండ్రాయిడ్‌ 4.4 కిట్‌ క్యాట్‌  ఆపరేటింగ్ సిస్టం, కర్వ్‌డ్‌ స్క్రీన్‌   డైనమిక్ కాంట్రాస్ట్ నిష్పత్తి 300000: 1. 1గిగాహెర్ట్స్‌ కోర్టెక్స్ఏ7 ప్రాసెసర్ విత్‌ మాలి 400 x 2 జీపీయూ . 1 జీబీ ర్యామ్‌,  8జీబీ స్టోరేజ్‌ ,  మైక్రో ఎస్‌డీ కార్డ్ రీడర్ ద్వారా దీన్ని విస్తరించుకునే సదుపాయం కూడా. ఇంకా ఫేస్బుక్, స్కైప్‌ ఇతర యాప్‌లు ప్రీలోడెడ్‌ విత్‌ డబుల్‌ స్పీకర్స్‌.  వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌పీ,  ఈథర్నెట్ కనెక్టివిటీ  సదుపాయం.
సరసమైన ధరల్లో ప్రపంచ టెక్నాలజీని అందించడమే తమ లక్ష్యమని మితాషి ఎడ్యూటైన్మెంట్ చైర్మన్,  ఎండీ, రాకేష్‌ దుగర్‌ తెలిపారు. కర్వ్‌డ్‌  స్మార్ట్‌ ఎల్‌ఈడీ  సిరీస్‌లో తొలి టీవీలను లాంచ్‌ చేసినట్టు చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement