అందరిలోనూ రోజువారీ ఖర్చులపై ఆందోళన పెరిగిపోయింది. ఇప్పుడున్న రోజుల్లో ఆహారం, ప్రయాణాల కోసం అత్యధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే ప్లేస్టోర్‌లో లభ్యమయ్యే కొన్ని యాప్‌లను వినియోగించడం ద్వారా చౌకగా ఆహార, ప్రయాణ సేవలను అందుకోవచ్చు. తద్వారా ప్రతి నెలా కొంతవరకూ సొమ్ము ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఈ యాప్‌లు ఎలా పని చేస్తాయి? అవి మీకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల యష్ తివారీ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో చౌకగా ప్రయాణాన్ని అందించే క్యాబ్‌ను ఎలా బుక్ చేసుకోవచ్చో వివరించారు. విశేషమేమిటంటే ఈ యాప్ పూర్తిగా ఉచితం. దీనిని ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ పేరు క్యాబ్ కంపేర్(Cab Compare). ఈ ఒక్క యాప్‌లో ఓలా, ఉబెర్, ర్యాపిడోలలో మన ప్రయాణ ఛార్జీలను పరిశీలించి, మనకు చౌకగా అనిపించిన దానిని ఎన్నుకోవచ్చు. ఈ యాప్‌ను ఇప్పటికే ఐదు లక్షలకుపైగా యూజర్లు వినియోగిస్తున్నారు. పైగా దీనికి మంచి ఫీడ్ బ్యాక్ కూడా ఉంది. అదే సమయంలో ఈ యాప్.. యూజర్ల గోప్యతకు సంబంధించి అనేక భద్రతా ఫీచర్లను కూడా జోడించింది.
ఇక చౌకగా ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే క్రేవియో(Craveo) అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ కూడా ‘క్యాబ్ కంపేర్’ మాదిరిగానే పనిచేస్తుంది. ఇందులో మీ జొమాటో లేదా స్విగ్గీ ఖాతాను జోడించడం ద్వారా చౌకైన ఆహారం ఎక్కడ లభిస్తుందో వెంటనే తెలుసుకోవచ్చు. ఈ యాప్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్ ఉపయోగించడం చాలా సులభం. ముందుగా క్రేవియో యాప్‌ని తెరిచాక ఖాతాను జోడించే ఎంపికను పొందుతారు. దీని సాయంతో జొమాటో, స్విగ్గీలలో ఎక్కడ చౌకగా ఆహారం దొరుకుతోందో తెలుసుకోవచ్చు. మరెందుకాలస్యం? ఈ యాప్‌లను ఒకసారి వినియోగించి చూడండి.
Comments
Please login to add a commentAdd a comment