మనం సాధారణంగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటుంటాం. ఈ మధ్య స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలొచ్చక క్షణాల్లో ఫుడ్ మనముందు ఉంటోంది. ఏ సమయమైన మనకునచ్చింది ఆర్డర్ పెట్టుకుని చిటికెలో తినేయొచ్చు. ఈ మధ్య కాలంలో వీటి వినియోగం బాగా బాగా ఎక్కువగా ఉంది. అయితే చాలామంది తినగ మిగిలింది అదే డెలివరీ బాక్స్‌లో పెట్టి పడేస్తారు. ఇలా అస్సలు చేయకూడదట. దీనిపై అవగాహాన కల్పిస్తూ ఇద్దరు డిజటల్ క్రియేటర్స్ ఓ వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఆ ఇద్దరు క్రియేటర్స్ ఓ పేపర్ బ్యాగ్‌లో ప్లాస్టిక్ బాక్స్‌లో ఉంచిన రెండు రోజుల కిందట ఆహారాన్ని ఉంచి వాసనను చూడమంటూ పలువురి ఇస్తారు. వారంతా ఛీ..య్యాక్ అంటూ ఏంటిది అని అడుగుతారు. అదేంటో గెస్ చేయమని వారందర్నీ అడగగా..మురికి, టాయిలెట్లు, విరేచనాలకు సంబంధించనదిగా రకరకాలుగా వర్ణించి మరీ చెబుతారు.
ఆ తర్వాత ఆ డిజిటల్ క్రియేటర్‌లు అదేంటనేది చివర్లో చూపించగా.. అంత విస్తుపోతారు. మనమంతా ఆన్‌లైన్‌లో ఫుడ్‌ని ఆర్డర్ చేసుకుని తింటున్నాం బాగానే ఉంది. కానీ మిగిలింది ఆ డెలివరీ బాక్స్‌లోనే ఉంచి పడేస్తున్నాం. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. దీని వల్ల దుర్వాసన తోపాటు పలు రోగాలకు దారితీస్తుందని హెచ్చరిస్తారు. మనం ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని డెస్ట్ బెన్‌లో పడేసి ఆ తర్వాత ప్లాస్టిక్ బాక్స్‌ని క్లీన్ చేసి పడేయాలి.
అప్పుడే అది రీసైకిలింగ్‌కి పనికి వస్తుంది. అంతేగాదు మనం ఇలా చేస్తే వ్యర్థాలను సేకరించేవారికి ఎలాంటి ఆరోగ్య ప్రమాదం ఉండదంటూ ఆ వీడియోలో ప్రజలకు అవగాహన కల్పించే యత్నం చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు చాలామంది మాకు ఇలా అవుతుందని తెలియదు, తప్పక మార్చుకుంటామని చెప్పగా, కొందరూ "వ్యర్థాల నిర్వహణను మన విద్యా వ్యవస్థలో విలీనం చేయాలి. దీనివల్ల తరువాతి తరాలు బాధ్యతయుతంగా వ్యవహరించడం, పునర్వినియోగం గురించి తెలుసుకోగలుగుతారంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ముంచుకొస్తున్న ఎక్స్‌ఈసీ కోవిడ్ వేరియంట్..ఏకంగా 27 దేశాలకు..!)
Comments
Please login to add a commentAdd a comment