ప్రస్తుతం ఇల్లు కొనాలన్నా, భూములు కొనాలన్నా ఎంత డబ్బు వెచ్చించాల్సి ఉంటుందో అందరికి బాగా తెలుసు. ఆఖరికి అద్దెకు ఉండాలన్నా వేలకు వేలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అమెరికాలో ఒక డబుల్ బెడ్‌రూమ్ హౌస్ కేవలం రూ. 100 కంటే తక్కువ అని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. ఇందులో నిజమెంత? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలోని ఒక ఇల్లు కేవలం ఒక డాలర్ కంటే తక్కువ (దాదాపు రూ. 83) అని తెలుస్తోంది. ఈ వార్త నిజమే అని చెబుతున్నారు. అది కూడా ఇండిపెండెంట్ హౌస్ కావడం గమనార్హం. ఇది 724 చదరపు అడుగుల విస్తీరణంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు బహుశా ఇదే అయి ఉంటుంది.
ఇదీ చదవండి: కోట్లు సంపాదించేలా చేసిన భారత పర్యటన - ఇండియాలో అమెరికన్ హవా!
ఈ చీపెస్ట్ హౌస్ ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నట్లు, దీనిని 1956లో నిర్మించినట్లు చెబుతున్నారు. ఈ ఇంటిని బాగు చేయడానికి కనీసం 25వేల నుంచి 45వేల డాలర్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని వేలం వేయనున్న జిల్లో సంస్థ పేర్కొంది. మొత్తానికి ఇల్లు ఎంత శిధిలావస్థలో ఉన్నా కేవలం రూ. 83 లభించడం చాలా అరుదైన విషయం.
Comments
Please login to add a commentAdd a comment