న్యూఢిల్లీ: రష్యా నుంచి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 36.27 బిలియన్ డాలర్లు విలువైన (రూ.3.01లక్షల కోట్లు) దిగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దిగుమతుల్లో 65 శాతం వృద్ధి కనిపిస్తోంది. 2022 ఏప్రిల్–అక్టోబర్ మధ్య రష్యా నుంచి దిగుమతులు 22.13 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
ముడి చమురు, ఎరువులు ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో భారత్ దిగుమతులకు రష్యా రెండో అతిపెద్ద కేంద్రంగా నిలిచింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముందు మన దేశ దిగుమతుల్లో రష్యా వాటా కేవలం ఒక్కశాతమే. కానీ, ప్రస్తుతం భారత చమురు దిగుమతుల్లో రష్యా 40 శాతం వాటా ఆక్రమించేసింది. ఉక్రెయిన్‌పై దాడికి ప్రతీకారంగా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో భారత్‌కు మార్కెట్ కంటే తక్కువ ధరకే చుమురు సరఫరాకు రష్యా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి భారత్ భారీగా చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది.
దేశాల వారీగా..
♦ ఇక ఏప్రిల్–అక్టోబర్ మధ్య చైనా నుంచి దిగుమతులు 60.02 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి రూ.60.26 బిలియన్ డాలర్ల వద్దే ఉన్నాయి.
♦అమెరికా నుంచి దిగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు 16 శాతం తగ్గి 24.89 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
♦యూఏఈ నుంచి దిగుమతులు 21 శాతం తగ్గి 24.91 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
♦అంతేకాదు సౌదీ అరేబియా, ఇరాక్, ఇండోనేషియా, సింగపూర్, కొరియా నుంచి కూడా దిగుమతులు క్షీణించాయి.
♦ స్విట్జర్లాండ్ నుంచి దిగుమతులు క్రితం ఏడాది మొదటి ఏడు నెలల్లో 10.48 బిలియన్ డాలర్లుగా ఉంటే, అవి ఈ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో 13.97 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి.
♦మరో వైపు భారత్ ఎగుమతులకు కేంద్రంగా ఉన్న టాప్–10 దేశాలలో, ఆరు దేశాలకు ఏప్రిల్–అక్టోబర్ మధ్య ఎగుమతులు ప్రతికూలంగా నమోదయ్యాయి. అమెరికా, యూఏఈ, సింగపూర్, జర్మనీ, బంగ్లాదేశ్, సౌదీ అరేబియాకు తగ్గాయి.
♦బ్రిటన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌కు ఎగుమతులు వృద్ధి చెందాయి.
♦చైనాకు ఎగుమతులు 8.92 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది మొదటి ఏడు నెలల్లో ఇవి 8.85 బిలియన్ డాలర్లు.
రష్యా నుంచి భారీగా దిగుమతులు
Published Thu, Nov 16 2023 8:32 AM | Last Updated on Thu, Nov 16 2023 9:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment