రామ్‌ సినిమా ఆగిపోయిందా..? | Ram Praveen Sattaru Action Thriller Shelved | Sakshi
Sakshi News home page

Published Wed, May 23 2018 2:25 PM | Last Updated on Wed, May 23 2018 2:25 PM

Ram Praveen Sattaru Action Thriller Shelved - Sakshi

ప‍్రస్తుతం హలో గురూ ప్రేమకోసమే సినిమా పనుల్లో బిజీగా ఉన్న యంగ్ హీరో రామ్‌, ఈ సినిమా తరువాత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ లో నటించేందుకు ఓకె చెప్పాడు. గరుడవేగ సినిమాతో సక్సెస్‌ సాధించిన ప‍్రవీణ్‌, రామ్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించాలన భావించాడు.

అయితే ప్రస్తుతం ఉన్న రామ్‌ మార్కెట్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ వర్క్‌ అవుట్ కాదన్న ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. నేను శైలజ తరువాత రామ్‌ సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఈ సమయంలో భారీ బడ్జెట్‌ తో సినిమా చేస్తే రిస్క్‌ అన్న ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్‌. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement