
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో లాక్‌డౌన్‌లు అమలైన క్రమంలో కొద్దినెలలుగా నిలిచిపోయిన తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించామని ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ గరుడవేగ తెలిపింది. తమ బ్రాంచీలన్నీ పున:ప్రారంభమయ్యాయని పేర్కొంది. వినియోగదారుల సరుకులను ఎప్పటిలాగే దూర దేశాలలో ఉన్న తమ వారికి అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ భౌతిక దూరం, ఐసోలేషన్ వంటి కోవిడ్-19 నిబంధనలను అమలు చేస్తామని తెలిపింది.
తమ సంస్థ అమెరికా, ఇంగ్లాండ్, యూరప్ లోని అనేక దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయి, ఎన్నో మిడిల్ ఈస్ట్ దేశాలతో సహా 200 దేశాలకు సేవలను అందిస్తున్నదని గరుడవేగ పేర్కొంది. ఇక గరుడ బజార్ "రిటర్న్ గిఫ్ట్" అనే సర్వీస్ ద్వారా, ఎన్నారైలు భారతదేశంలో ఉండే తమవారికోసం బహుమతులూ, స్వీట్లూ పంపవచ‍్చని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment