resumed
-
భారత్ కీలక నిర్ణయం.. కెనడియన్లకు వీసా పునరుద్ధరణ
ఢిల్లీ: జీ20 వర్చువల్ సమావేశం నిర్వహించడానికి ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా పౌరులకు ఎలక్ట్రానిక్ వీసా సేవలను పునరుద్ధరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు రెండు నెలల తర్వాత వీసా సేవలను ప్రారంభించడం గమనార్హం. ఈ చర్యతో పర్యటక వీసాతో పాటు కెనడాకు అన్ని రకాల వీసాలను పునరుద్దరించినట్లయింది. కెనడాకు వ్యాపర, మెడికల్ వీసా సేవలను భారత్ గత నెలలోనే ప్రారంభించింది. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు వివాదంలో సెప్టెంబర్ 21న కెనడాకు భారత్ వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించాడు. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ట్రూడో ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఈ అంశంపై ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది. ఇరుదేశాలు తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఇరుదేశాలు దౌత్య వేత్తలను సమాన సంఖ్యలో ఉంచాలని భారత్ డిమాండ్ చేసింది. ఎక్కువ సంఖ్యలో ఉన్న కెనడా దౌత్య వేత్తలను ఉపసంహరించుకోవాలని గడువు కూడా విధించింది. ఈ వివాదంలో భాగంగానే భారత్ నుంచి కెనడా 41 మంది దౌత్య వేత్తలను కూడా ఉపసంహరించుకుంది. నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తుకు సహకరించేలా భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చెసింది కెనడా. పశ్చిమాసియా దేశాల పర్యటనల్లోనూ ట్రూడో ఈ అంశాన్ని లేవనెత్తారు. ట్రూడో వ్యాఖ్యలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఇటీవల యూకే వేదికగా జరిగిన ప్రపంచ స్థాయి సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ అంశంపై స్పందించారు. నిజ్జర్ కేసులో దర్యాప్తును భారత్ తోసిపుచ్చడం లేదు.. కానీ ఆధారాలు సమర్పించాలని డిమాండ్ చేశారు. నిరాధారమైన ఆరోపణలతో దర్యాప్తు కోరకూడదని చెప్పారు. ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
రీజెన్సీ సిరామిక్స్ పునరుద్ధరణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ గురువారం పునఃప్రారంభమైంది. కార్మికుల వివాదాల నేపథ్యంలో దశాబ్దంన్నర క్రితం యానాం రీజెన్సీ లాకౌట్ ప్రకటించింది. అప్పటి నుంచి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు కొలిక్కివచ్చాయి. ప్రయోగాత్మకంగా ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. రీజెన్సీ సిరామిక్స్‌ను తిరిగి పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు యాజమాన్యం ఏర్పాట్లు పూర్తిచేసింది. సంక్లిష్టమైన డిజైన్లకు మారుపేరుగా నిలిచిన రీజెన్సీ సిరామిక్స్ తొలిసారి రీజెన్సీ నేచురల్ టైల్స్‌ను చెన్నయ్‌లో విడుదల చేసింది. రూ.70 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కంపెనీ నాలుగు టైల్స్ తయారీ లైన్లలో మొదటి దానిని ప్రారంభించేందుకు సిద్ధం చేసింది. కంపెనీ మొదటి లైన్ రోజుకు 7 వేల చదరపు మీటర్లను ఉత్పత్తి చేయనుంది. దీనిని రోజుకు 25 వేల చదరపు మీటర్ల సామర్థ్యానికి విస్తరించనున్నారు. అన్ని పరిమాణాలు, రకాలు, గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్, ఫుల్ బాడీ విట్రిఫైడ్ టైల్స్, పాలి‹Ù్డ విట్రిఫైడ్ టైల్స్, డబుల్ చార్జ్డ్ టైల్స్, వాల్ టైల్స్, ఎక్స్టీరియర్ టైల్స్, స్టెప్స్, రైజర్లలో ఉత్పత్తి చేయడానికి నిర్ణయించారు. రీజెన్సీ ఉత్పత్తులను దేశంలోనే దక్షిణాది, తూర్పు ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రీజన్సీ డైరెక్టర్ నరాల సత్యేంద్రప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు చెప్పారు. వచ్చే మూడేళ్లలో రూ.100 కోట్లు ఆదాయం లక్ష్యంగా ఉత్పత్తిపై దృష్టి పెట్టామన్నారు. రాజధాని నగరాలతోపాటు మిగిలిన నగరాల్లో షోరూంలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. యానాంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఆరి్థక వ్యవస్థ బలోపేతంలో రీజెన్సీ భాగస్వామ్యం వహిస్తుందని ఆయన చెప్పారు. -
గన్నవరం: నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం
-
గరుడవేగ సేవలు పునః ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో లాక్డౌన్లు అమలైన క్రమంలో కొద్దినెలలుగా నిలిచిపోయిన తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించామని ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ గరుడవేగ తెలిపింది. తమ బ్రాంచీలన్నీ పున:ప్రారంభమయ్యాయని పేర్కొంది. వినియోగదారుల సరుకులను ఎప్పటిలాగే దూర దేశాలలో ఉన్న తమ వారికి అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ భౌతిక దూరం, ఐసోలేషన్ వంటి కోవిడ్-19 నిబంధనలను అమలు చేస్తామని తెలిపింది. తమ సంస్థ అమెరికా, ఇంగ్లాండ్, యూరప్ లోని అనేక దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయి, ఎన్నో మిడిల్ ఈస్ట్ దేశాలతో సహా 200 దేశాలకు సేవలను అందిస్తున్నదని గరుడవేగ పేర్కొంది. ఇక గరుడ బజార్ "రిటర్న్ గిఫ్ట్" అనే సర్వీస్ ద్వారా, ఎన్నారైలు భారతదేశంలో ఉండే తమవారికోసం బహుమతులూ, స్వీట్లూ పంపవచ్చని పేర్కొంది. -
తొలిరోజే 630 విమానాలు రద్దు
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన విమాన సర్వీసులు రెండు నెలల తర్వాత సోమవారం పునఃప్రారంభమయ్యాయి. స్వస్థలాలకు వెళ్లేందుకు విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయాలకు చేరుకున్నారు. ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టులు కొంత రద్దీగా కనిపించాయి. ఢిల్లీ నుంచి మొదటి విమానం ఉదయం 4.45 గంటలకు పుణేకు బయలుదేరింది. ముంబై నుంచి తొలి ఫ్లైట్ ఉదయం 6.45 గంటలకు బిహార్ రాజధాని పట్నాకు బయలుదేరింది. అయితే, కరోనా భయంతో విమానాల రాకపోకలకు కొన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపకపోవడం, కొన్ని ఎయిర్‌పోర్టుల్లో పరిమిత సంఖ్యలోనే విమానాలకు అనుమతించడంతో తొలిరోజే 630 విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని విమానయాన పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు విమానాల సర్వీసులను ఇప్పుడే ప్రారంభించడానికి విముఖత వ్యక్తం చేశాయి. అలాగే ముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రధాన ఎయిర్‌పోర్టుల నుంచి సర్వీసుల సంఖ్యను కుదించారు. రాష్ట్రాల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వ ప్రకటన మేరకు సోమవారం 630 విమానాలను రద్దు చేశారు. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు చేరుకున్నారు. విమానాలు రద్దయ్యాయని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దేశీయ విమాన సేవలు పునఃప్రారంభం అయ్యాక తొలిరోజు సోమవారం 532 విమానాలు రాకపోకలు సాగించాయని, 39,231 మంది ప్రయాణించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ చెప్పారు. మంగళవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. 28 నుంచి పశ్చిమ బెంగాల్లో విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. మున్ముందు దేశీయ విమానాలు, ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్గదర్శకాలు పాటిస్తేనే..: ప్రయాణికుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు విమానయాన శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఫేస్ మాస్కులు ధరించిన వారినే విమానాల్లోకి అనుమతించాలని పేర్కొంది. విమానాల్లో ఆహారం సరఫరా ఉండరాదంది. మొబైల్ ఫోన్లు ఉన్నవారు ఆరోగ్యసేతు యాప్‌లో తమ ఆరోగ్యం వివరాలు నమోదు చేయాలని, లేనివారు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం సమర్పించాలని సూచించింది. టికెట్ల ధరల విషయంలోనూ పరిమితి విధించింది. తమ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టులకు విమానాల్లో చేరుకునేవారి విషయంలో సొంతంగా క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తామని కర్ణాటక, తమిళనాడు, కేరళ, బిహార్, పంజాబ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు ప్రకటించాయి. వివాదంలో కేంద్ర మంత్రి సదానంద కేంద్ర మంత్రి సదానంద గౌడ వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో బెంగళూరు వచ్చి, క్వారంటైన్‌కు వెళ్లకుండా, నేరుగా ఇంటికి వెళ్లడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. నిత్యావసర వస్తువుల కిందకు వచ్చే ఔషధ విభాగ ఇన్చార్జి మంత్రిగా తనకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఔషధాల ఉత్పత్తి, సరఫరా తదితర కీలక అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన తను క్వారంటైన్లో ఉండటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నిత్యావసర వస్తు విభాగాలకు చెందినవారికి కేంద్రం మినహాయింపు ఇచ్చిందని కర్ణాటక ప్రభుత్వం కూడా పేర్కొంది. అయితే, గౌడ తీరుపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వచ్చాయి. నిబంధనలు సామాన్యులకే కానీ, వీఐపీలకు కాదంటూ పలువురు వ్యాఖ్యానించారు. జూన్ 6 వరకు అన్ని సీట్లలో కూర్చోవచ్చు ఎయిర్ ఇండియాను అనుమతించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు జూన్ 6 వరకు నడిపే అంతర్జాతీయ విమానాల్లో మధ్య సీటుని సైతం భర్తీ చేసుకునేందుకు ఎయిర్ ఇండియాను సుప్రీంకోర్టు అనుమతించింది. విమానయాన సంస్థల లాభం కంటే ప్రజల ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వానికీ, ఎయిర్ ఇండియాకీ స్పష్టం చేసింది. జూన్ 6 తరువాత మాత్రం బాంబే హైకోర్టు ఆదేశాలననుసరించి ఎయిర్ ఇండియా విమానాల్లో మధ్య సీటుని తప్పనిసరిగా ఖాళీగా ఉంచాలని తేల్చింది. మధ్యసీటు ఖాళీగా ఉంచాలన్న హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం, ఎయిర్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రంజాన్ సందర్భంగా కోర్టుకి సెలవు ఉన్నప్పటికీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారించింది. విమానాల్లో భౌతిక దూరం ఆవశ్యకతను అధికారులు గుర్తించాలని, కోవిడ్ నేపథ్యంలో దగ్గరగా కూర్చోవడం ప్రమాదమని నొక్కి చెప్పింది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయిన విమానమైతే జూన్ 6 వరకు మధ్య సీటుని భర్తీచేసుకునే అవకాశాన్నిస్తున్నట్టు తెలిపింది. -
భారత ఐటీ నిపుణులకు భారీ ఊరట
వాషింగ్టన్: భారతీయ ఐటి నిపుణులకు భారీ ఊరట లభించింది. ప్రీమియం హెచ్ 1 బీ వీసాల జారీపై (ప్రత్యేక ఫీజుతో ప్రీమియం హెచ్-1బీ వీసాల ఆమోద ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసుకునే వీలును కల్పించేదే ప్రీమియం ప్రాసెసింగ్) అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీమియం హెచ్ 1 బీ వీసాల జారీని పునరుద్ధరించేందుకు ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో సుమారు 65వేలమంది భారత ఐటీ ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించింది. 2018 సంవత్సరానికి సంబంధించి ప్రీమియం హెచ్-1బీ వీసాల ఆమోద ప్రక్రియను పునరుద్ధరించామని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రాసెసింగ్ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తవుతుందని హామీ ఇచ్చింది. అలాగే గరిష్ట పరిమితిని 65,000గా నిర్ణయించింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 3నుంచి ప్రీమియం హెచ్ 1-బీ వీసా ప్రాసెసింగ్ ను ఆరు నెలల పాటు రద్దు చేసింది. భారీ డిమాండ్, రెగ్యులర్ వీసా ప్రాసెసింగ్ లో జాప్యం తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
'జెయింట్ వాల్ ఆఫ్ సీ' ఎందుకో తెలుసా?
జకర్తా: రాజధాని నగరాన్ని కాపాడుకునే చర్యలను ఇండోనేషియా పునఃప్రారంభించింది. రోజు రోజుకూ సముద్రమట్టం పెరుగుతూ పోతుండటంతో జకర్తా మునిగిపోకుండా ఉండేందుకు ఇండోనేషియా ప్రభుత్వం 'జెయింట్ వాల్ ఆఫ్ సీ'ని నిర్మిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ లో వాల్ కారణంగా పర్యావరణం నష్టపోతుందంటూ స్వచ్ఛంద సంస్థలు చేసిన నిరసనలతో ఇండోనేషియా గవర్నర్ ప్రాజెక్టును నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచంలో అత్యధిక జనభా నివసించే నగరాల్లో జకర్తా కూడా ఒకటి. అంతేకాకుండా మిగిలిన నగరాలతో పోలిస్తే అత్యంత వేగంగా మునిగిపోతున్న నగరం కూడా ఇదే. దీంతో రక్షణ చర్యలు చేపట్టిన ఇండోనేషియా ప్రభుత్వం 15 మైళ్ల విస్తీర్ణంలో 'జెయింట్ వాల్ ఆఫ్ సీ' నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ వాల్ ను నిర్మించకపోతే భవిష్యత్తులో జకర్తాలో మంచి నీటి జాడ దొరకదని మారిటైమ్ మంత్రి లుహుత్ పన్ జైతన్ చెప్పారు. ఈ మేరకే వాల్ నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. కాగా మంగళవారం రాత్రి నుంచి వాల్ పునఃనిర్మాణం ప్రారంభమయింది. వాల్ నిర్మాణ ప్లాన్ లో భాగంగా ఉత్తర జకర్తా సముద్రంలో అక్కడక్కడా కృత్రిమ ఐల్యాండ్స్ ను నిర్మిస్తారు. వీటిలో సింగపూర్ తరహా షాపింగ్ మాల్ లను నిర్మించనున్నట్లు జైతన్ తెలిపారు. వరదలు, సునామీల సమయంలో నీటి ఒరవడిని తట్టుకునే విధంగా డ్రైనేజీ వ్యవస్థను కూడా రూపుదిద్దనున్నారు. -
1 నుంచి కేదార్నాథ్ యాత్ర పునఃప్రారంభం
ఉత్తరాఖండ్‌లో జూన్‌లో సంభవించిన భారీ వర్షాలు, వరదల తాకిడికి మరుభూమిగా మారిన ప్రసిద్ధ కేదార్నాథ్ పుణ్యక్షేత్రం పునరుద్దరణ పనులు పూర్తికావస్తున్నాయి. వచ్చే నెల 1 నుంచి కేదార్నాథ్ యాత్ర పునఃప్రారంభం కానున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ గురువారం చెప్పారు. కాగా ఈ ప్రాంతంలో రహదారుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తొలుత పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నట్టు బహుగుణ తెలిపారు. వరదలకు ధ్వంసమైన రోడ్లు ఇంకా పునర్నిర్మాణ దశలో ఉన్నాయి. వరదల తాకిడికి కేదార్‌నాథ్‌తో పాటు ఇతర పర్యాటక ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే.