ఉత్తరాఖండ్లో జూన్లో సంభవించిన భారీ వర్షాలు, వరదల తాకిడికి మరుభూమిగా మారిన ప్రసిద్ధ కేదార్నాథ్ పుణ్యక్షేత్రం పునరుద్దరణ పనులు పూర్తికావస్తున్నాయి. వచ్చే నెల 1 నుంచి కేదార్నాథ్ యాత్ర పునఃప్రారంభం కానున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ గురువారం చెప్పారు.
కాగా ఈ ప్రాంతంలో రహదారుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తొలుత పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నట్టు బహుగుణ తెలిపారు. వరదలకు ధ్వంసమైన రోడ్లు ఇంకా పునర్నిర్మాణ దశలో ఉన్నాయి. వరదల తాకిడికి కేదార్నాథ్తో పాటు ఇతర పర్యాటక ప్రాంతాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే.
1 నుంచి కేదార్నాథ్ యాత్ర పునఃప్రారంభం
Published Thu, Sep 26 2013 5:57 PM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM
Advertisement
Advertisement