భారత ఐటీ నిపుణులకు భారీ ఊరట | US resumes premium processing of H-1B visas | Sakshi
Sakshi News home page

భారత ఐటీ నిపుణులకు భారీ ఊరట

Published Tue, Sep 19 2017 4:36 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

US resumes premium processing of H-1B visas

వాషింగ్టన్: భారతీయ ఐటి నిపుణులకు భారీ ఊరట లభించింది.   ప్రీమియం హెచ్‌ 1 బీ వీసాల జారీపై  (ప్రత్యేక ఫీజుతో  ప్రీమియం హెచ్-1బీ వీసాల ఆమోద ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసుకునే వీలును కల్పించేదే ప్రీమియం ప్రాసెసింగ్) అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.   ప్రీమియం హెచ్‌ 1 బీ వీసాల జారీని పునరుద్ధరించేందుకు ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయించింది.  తాజా నిర్ణయంతో సుమారు  65వేలమంది భారత ఐటీ ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించింది.  

 2018 సంవత్సరానికి సంబంధించి ప్రీమియం హెచ్-1బీ వీసాల ఆమోద ప్రక్రియను  పునరుద‍్ధరించామని యూఎస్ సిటిజన్ షిప్ అండ్‌  ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రాసెసింగ్‌  ప్రక్రియ 15 రోజుల్లో   పూర్తవుతుందని హామీ  ఇచ్చింది. అలాగే  గరిష్ట పరిమితిని 65,000గా నిర్ణయించింది.

కాగా  ఈ ఏడాది ఏప్రిల్‌ 3నుంచి  ప్రీమియం హెచ్ 1-బీ   వీసా  ప్రాసెసింగ్‌ ను ఆరు నెలల పాటు రద్దు చేసింది. భారీ డిమాండ్‌,  రెగ్యులర్‌ వీసా ప్రాసెసింగ్‌ లో జాప్యం తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా  ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement