30 కథలు విన్నా.. ఏదీ నచ్చలేదు | garuda vega 126.18m movie teaser released | Sakshi
Sakshi News home page

30 కథలు విన్నా.. ఏదీ నచ్చలేదు

Published Sat, Sep 23 2017 1:00 AM | Last Updated on Sat, Sep 23 2017 2:08 AM

garuda vega 126.18m movie teaser released

‘‘నేను చాలా ఫెయిల్యూర్స్‌ను ఫేస్‌ చేసిన తర్వాత విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేయమని కొందరు అడిగినప్పుడు.. సరే అనుకుని 30 కథలకు పైగా విన్నాను. ఏదీ నచ్చలేదు. నేను పీక్స్‌లో ఉన్నప్పుడు ఎలాంటి స్క్రిప్ట్‌తో సినిమా చేయాలనుకున్నానో అలాంటి కథనే దర్శకుడు చెప్పడంతో ఒప్పుకున్నా’’ అన్నారు రాజశేఖర్‌. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘‘పి.ఎస్‌.వి గరుడవేగ.. 126.18ఎం’. కోటేశ్వరరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు.

రాజశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘ప్రవీణ్‌ సత్తారు ప్రాజెక్ట్‌ను హ్యాండిల్‌ చేయగలడా అనుకున్నా. కానీ అద్భుతంగా తెరకెక్కించాడు. ఐదారు కోట్లతో కంప్లీట్‌ చేద్దామని స్టార్ట్‌ చేసిన ఈ సినిమా బడ్జెట్‌ పాతిక కోట్లు అయింది. నాపై నమ్మకంతో కోటేశ్వరరాజుగారు, ఆయన శ్రీమతి హేమగారు భారీ స్థాయిలో నిర్మించారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు రాజశేఖర్‌గారే కరెక్ట్‌ అనుకుని ఆయన్ను కలిశాను. జీవితగారి సపోర్ట్‌ మరువలేనిది. ఇంత పెద్ద సినిమాకు ఏది అడిగితే అది సమకూర్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు ప్రవీణ్‌ సత్తారు. ‘‘మా ఊరిలో ‘మగాడు’ సినిమా షూట్‌ జరుగుతున్నప్పుడు రాజశేఖర్‌గారిని చూసి ఆరాధించాను. ఇప్పుడు ఆయనతో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి’’ అన్నారు నిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement