బిజీ అవుతున్న యువ నటుడు | Charandeep Surineni New Make over | Sakshi
Sakshi News home page

బిజీ అవుతున్న యువ నటుడు

Published Thu, Feb 7 2019 5:06 PM | Last Updated on Thu, Feb 7 2019 5:06 PM

Charandeep Surineni New Make over - Sakshi

‘బాహుబలి’లో కాలకేయ తమ్ముడిగానూ, ‘పీఎస్వీ గరుడవేగ’లో పోలీస్ పాత్రలోనూ ప్రేక్షకులను మెప్పించిన చరణ్‌దీప్‌ సూరినేని సరికొత్త మేకోవర్‌లో రెడీ అయ్యాడు. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’లో మెయిన్ విలన్ గా నటించిన చ‌ర‌ణ్‌దీప్‌కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు ఈ యువ నటుడు.

తాజాగా ఈ చరణ్ న్యూలుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. జుట్టు బాగా పెంచి, గడ్డంతో మెడ్రన్‌ లుక్‌ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కల్కి’ చిత్రాల్లో నటిస్తున్నాడు చరణ్ దీప్. ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘సీమరాజా’లో చరణ్ సూరినేని కీలక పాత్రలో నటించాడు.

ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు, మేకోవర్ గురించి చరణ్ సూరినేని మాట్లాడుతూ ‘రాజశేఖర్ గారి ‘పీఎస్వీ గరుడవేగ’లో పాజిటివ్ ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో నటించాను. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ రాజశేఖర్ గారితో నటించే అవకాశాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ కల్పించారు. రాజశేఖర్ గారు, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కిలో నేను పోలీస్ పాత్రలో నటిస్తున్నా. గరుడవేగలో నాది పాజిటివ్ క్యారెక్టర్ అయితే... కల్కిలో నెగిటివ్ క్యారెక్టర్.

ఈ సినిమాతో పాటు చిరంజీవిగారితో 'సైరా నరసింహారెడ్డి'లో నటిస్తున్నా. ఆ పాత్ర గురించి ఇప్పుడేమీ చెప్పలేను. అయితే మంచి పాత్రలో నటిస్తున్నానని చెప్పగలను. అలాగే, తమిళంలోనూ నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికి ఓ పది సినిమాల్లో నటించాను. ప్రస్తుతం తమిళంలో ఓ భారీ సినిమాలో నటిస్తున్నా. మరో మూడు నాలుగు భారీ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇంట‌ర్‌నేష‌న‌ల్ డిజిట‌ల్ ఫ్లాట్‌ఫార్మ్ కోసం రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్‌లో నటించమని సంప్రదించారు. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తా’ అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement