charandeep
-
బిజీ అవుతున్న యువ నటుడు
‘బాహుబలి’లో కాలకేయ తమ్ముడిగానూ, ‘పీఎస్వీ గరుడవేగ’లో పోలీస్ పాత్రలోనూ ప్రేక్షకులను మెప్పించిన చరణ్‌దీప్ సూరినేని సరికొత్త మేకోవర్‌లో రెడీ అయ్యాడు. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’లో మెయిన్ విలన్ గా నటించిన చరణ్‌దీప్‌కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు ఈ యువ నటుడు. తాజాగా ఈ చరణ్ న్యూలుక్లో ఆకట్టుకుంటున్నాడు. జుట్టు బాగా పెంచి, గడ్డంతో మెడ్రన్ లుక్ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కల్కి’ చిత్రాల్లో నటిస్తున్నాడు చరణ్ దీప్. ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘సీమరాజా’లో చరణ్ సూరినేని కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు, మేకోవర్ గురించి చరణ్ సూరినేని మాట్లాడుతూ ‘రాజశేఖర్ గారి ‘పీఎస్వీ గరుడవేగ’లో పాజిటివ్ ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో నటించాను. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ రాజశేఖర్ గారితో నటించే అవకాశాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ కల్పించారు. రాజశేఖర్ గారు, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కిలో నేను పోలీస్ పాత్రలో నటిస్తున్నా. గరుడవేగలో నాది పాజిటివ్ క్యారెక్టర్ అయితే... కల్కిలో నెగిటివ్ క్యారెక్టర్. ఈ సినిమాతో పాటు చిరంజీవిగారితో 'సైరా నరసింహారెడ్డి'లో నటిస్తున్నా. ఆ పాత్ర గురించి ఇప్పుడేమీ చెప్పలేను. అయితే మంచి పాత్రలో నటిస్తున్నానని చెప్పగలను. అలాగే, తమిళంలోనూ నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికి ఓ పది సినిమాల్లో నటించాను. ప్రస్తుతం తమిళంలో ఓ భారీ సినిమాలో నటిస్తున్నా. మరో మూడు నాలుగు భారీ సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ డిజిటల్ ఫ్లాట్ఫార్మ్ కోసం రూపొందుతున్న ఒక వెబ్ సిరీస్‌లో నటించమని సంప్రదించారు. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తా’ అన్నారు. -
రేష్మీగౌతమ్ సరసన నటిస్తున్న విలన్
లోఫర్ సినిమాలో విలన్‌గా చేసిన చరణ్‌దీప్ గుర్తున్నాడా? ఇంతకుముందు జిల్లాలో కూడా చేసిన ఇతడికి ప్రస్తుతం మంచి డిమాండు కనిపిస్తోంది. ఒకేసారి ఏకంగా ఆరు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఒక తెలుగు సినిమాలో మాత్రం పాజిటివ్ పాత్ర చేస్తూ.. రేష్మీగౌతమ్ సరసన కూడా నటిస్తున్నాడు. ఈ సంవత్సరం తనకు చాలా బిజీగా ఉందని, అయితే విజయాలు కూడా అలాగే వస్తున్నాయని చరణ్ దీప్ అంటున్నాడు. విశాల్ చేస్తున్న కత్తి సందై, సునీల్ హీరోగా వస్తున్న ఈడు గోల్డ్ ఎహ, ఇంకా వీరా, శరబ, నాను మత్తు వరలక్ష్మి, అంతమ్, మొట్ట శివ కెట్ట శివ.. వీటన్నింటిలోనూ చరణ్దీపే విలన్ పాత్రలు పోషిస్తున్నాడు. వీటన్నింటిలో ఈడు గోల్డ్ ఎహ సినిమాలో పాత్ర చాలా బాగుంటుందని, అందులో తండ్రికి బాగా దగ్గరగా ఉండే ఎమోషనల్ విలన్‌గా చేస్తున్నానని అన్నాడు. ఇక శరభ సినిమాలో అయితే.. ఇంతకుముందు అరుంధతిలో సోనుసూద్ చేసిన తరహా పాత్ర చేస్తున్నాడట. ఇది సోషియో ఫాంటసీ సినిమా అని, ఈ పాత్ర కోసం తాను పూర్తిగా మేకోవర్ చేయాల్సి వచ్చిందని అన్నాడు. కేవలం మేకప్ కోసమే రోజూ మూడుగంటలు పట్టిందని, ఇది తన కెరీర్లోనే చాలా ఛాలెంజింగ్ రోల్ అని తెలిపాడు. ఇక తెలుగులో వస్తున్న థ్రిల్లర్ మూవీ 'అంతం'లో వెరైటీగా పాజిటివ్ పాత్రలో చేస్తున్నాడు. ప్రతిసారీ విలన్ పాత్రల్లో కనపడే తనను పాజిటివ్ పాత్రలో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుమానంగానే ఉందని చెప్పాడు. ఈ సినిమాలో అతడు రేష్మి గౌతమ్ సరసన నటిస్తున్నాడు. -
ఆ ఇంట్లో...!
ఆ రోజు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. భర్త రాక కోసం ఎదురు చూస్తోంది. ఇంట్లో ఎవరో ఉన్నట్టు నీడ కనిపించింది. భర్తే ఇలా స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాడేమో అనుకుంది. కాదేమో అనే సందేహంతో భర్తకు ఫోన్ చేసింది. అయితే ఇంట్లో ఉన్నది భర్త కాదు... మరెవరో??తర్వాత ఆమె పరిస్థితి ఏమైందనే సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘అంతం’. బుల్లితెర నటి రష్మీ గౌతమ్, చరణ్ దీప్ ముఖ్య పాత్రల్లో స్వీయదర్శకత్వంలో జి.ఎస్.ఎస్.పి కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. దర్శక-నిర్మాత మాట్లాడుతూ- ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో సరికొత్త తరహా కథాంశంతో రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభిస్తోంది. అందరికీ నచ్చే కథాంశమిది. ఈ నెలాఖరులో ఈ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్,ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.లక్ష్మీపతి రావ్, బి.వేణు. -
'లోఫర్'లో విలన్ గా చరణ్ దీప్
చెన్నై: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లోఫర్' సినిమాలో విలన్ గా నటిస్తున్నట్టు నటుడు చరణ్ దీప్ తెలిపాడు. 'లోఫర్'లో నటించే అవకాశం తనకు లభించిన బర్త్ డే గిప్ట్ అని పేర్కొన్నాడు. పూరితో కలిసి పనిచేయడం తనకెంతో సంతోషంగా ఉందన్నాడు. ఆయన కోసం పలు సినిమాలు వదులుకున్నానని వెల్లడించాడు. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'లోఫర్' షూటింగ్ ప్రస్తుతం జోధ్ పూర్ లో జరుగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయింది. జిల్లా, పటాస్ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్ 2' సినిమాలోనూ చరణ్ దీప్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పబోనని స్పష్టం చేశాడు. 'సర్దార్' పేరు పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలో మరాఠీ నటుడు శరద్ కేల్కర్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. -
ఉత్తమ విలన్ అనిపించుకుంటా...
ప్రస్తుతం తెలుగు సినిమాలో విలనీ అనేది హీరోకి ఢీ అంటే ఢీ అనేలా ఉండాలి. అందుకు మంచి శారీరక సౌష్టవం.. పొడవు ఉంటూ ఆకర్షణ ఉండాలనే ఉద్దేశ్యంతో ఇతర భాషా నటులను తెలుగు ఇండస్ట్రీ ప్రోత్సహిస్తోంది. అయితే బాలీవుడ్ నటులకు ఏ మాత్రం తీసిపోబోమని ఈ మధ్య కాలంలో కొత్త నటులు తెలుగు నేల నుంచి విలనిజాన్ని పండించడానికి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ నటులను మరిపిస్తూ 6.5 అడుగుల ఎత్తు, 6 ప్యాక్ బాడీతో కండలు తిరిగిన దేహంతో విలన్ అంటే ఇలా ఉండాలి....అనే విధంగా ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరస అవకాశాలతో దూసుకుపోతున్నాడు మన తెలుగు ప్రతినాయకుడు చరణ్‌దీప్. ఆయన తన సినీ విశేషాల గురించి సాక్షితో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు... విశాఖ ఫీచర్స్ : బీటెక్ పూర్తయిన తర్వాత సినిమాలో అవకాశాలు వెదుక్కుంటూ హైదరాబాద్ వైపు అడుగులు వేశాను. నా ఆహార్యం చూసిన తర్వాత కచ్చితంగా విలన్‌గా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటానని అనిపించింది. దాని కోసం ముందుగా శారీరక సామర్ధ్యం పెంచేందుకు బాడీ బిల్డప్ చేశాను. అలానే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తరువాత ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. మొదటిసారిగా ‘బిల్లా రంగా’ చిత్రంలో అవకాశం వచ్చింది. తరువాత ‘తుంగభద్ర’ సినిమాలో నటించాను. ఆ చిత్రం పూర్తయిన వెంటనే అనూహ్యంగా రాజమౌళి ‘బాహుబలి’ చిత్రంలో మెయిన్ విలన్ ప్రభాకర్ తమ్ముడిగా అవకాశం వచ్చింది. వాటితోపాటు ‘పటాస్’, ఇప్పుడు ‘వినవయ్యా రామయ్యా’ చిత్రం. ఇవే కాకుండా తుంగభద్ర సినిమా సమయంలోనే తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన జిల్లా చిత్రంలో, అలానే పులిలో కూడా విలన్‌గా మంచి అవకాశాలు వచ్చాయి. రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నవి, సెట్స్ మీద ఉన్నవి ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. నా బాడీనే అవకాశాలు తెచ్చింది.. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో విలన్ అంటే బాలీవుడ్ వైపు అందరూ పరుగులు తీసేవారు అయితే తెలుగులో కూడా మంచి విలనీ చేసేవారు ఉన్నారని ఇప్పుడు వస్తున్న నటులు నిరూపిస్తున్నారు. నా పొడవు, బాడీ నాకు విలనీగా గుర్తింపు తీసుకొస్తుందని అనుకున్నాను. నటనలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోకున్న నా బాడీనే నాకు అవకాశాలు తెచ్చింది. సీనియర్ నటులను చూసే నేర్చుకున్నాను.. నటనలో ప్రత్యేకంగా ఎవరి వద్ద శిక్షణ తీసుకోలేదు. నటన నేర్చుకుంటే రాదని నా ఫీలింగ్. సెట్స్‌లో ఉన్నప్పుడు మిగిలిన నటులు ఎలా చేస్తున్నారు. ఏ సీన్లో ఏ స్థాయిలో ఎమోషన్స్ పలికిస్తున్నారు పరిశీలిస్తాను.. అలా తోటి నటీనటులను చూసే అన్నీ నేర్చుకుంటా. అలానే సీనియర్ నటుల సలహాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు నటనలో నన్ను నేను మెరుగుపరుచుకుంటున్నాను. ‘వినవయ్యా రామయ్యా’ ప్రత్యేకం.. ‘వినవయ్యా రామయ్యా’ చిత్రం నా కెరియర్లో ఓ ప్రత్యేక చిత్రంగా చెప్పుకుంటాను. చూడడానికి పద్ధతిగా కనిపించే పాత్రతోనే విలనీ చూపించాలి. ఈ సినిమా నా గుర్తింపుని మరింతగా పెంచింది. అలానే రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బహుబలి’లో ఓ కీలకమైన పాత్రకి నన్ను ఎంపిక చేసుకున్నారు. బాహుబలి పార్ట్-2లో నా పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఓ గొప్ప చిత్రంలో నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. విలన్ గానూ నటన చూపించొచ్చు... సినిమాలో మన యాక్టింగ్ టాలెంట్ చూపించాలంటే అది విలనీ ద్వారా ఎక్కువ అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. హీరో అవ్వాలనే ఆలోచన లేదు. కాని నాకంటూ ప్రత్యేకత చూపించే విధంగా పాత్రలు చేయాలని నా ఆలోచన. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్‌గా నటించాలని. తమిళంలో చేసిన మొదటి చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటించే అవకాశం వచ్చింది.