ఆ ఇంట్లో...! | Rashmi Gautam looks sizzling hot in 'Antham' movie trailer | Sakshi
Sakshi News home page

ఆ ఇంట్లో...!

Published Sat, Jun 11 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

ఆ ఇంట్లో...!

ఆ ఇంట్లో...!

ఆ రోజు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. భర్త రాక కోసం ఎదురు చూస్తోంది. ఇంట్లో ఎవరో ఉన్నట్టు నీడ కనిపించింది. భర్తే ఇలా స్వీట్ సర్‌ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాడేమో అనుకుంది. కాదేమో అనే సందేహంతో భర్తకు ఫోన్ చేసింది. అయితే ఇంట్లో ఉన్నది భర్త కాదు... మరెవరో??తర్వాత ఆమె పరిస్థితి ఏమైందనే సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘అంతం’. బుల్లితెర నటి రష్మీ గౌతమ్, చరణ్ దీప్  ముఖ్య పాత్రల్లో స్వీయదర్శకత్వంలో జి.ఎస్.ఎస్.పి కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది.

   దర్శక-నిర్మాత మాట్లాడుతూ- ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో సరికొత్త తరహా కథాంశంతో రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. అందరికీ నచ్చే కథాంశమిది. ఈ నెలాఖరులో ఈ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి  సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్,ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.లక్ష్మీపతి రావ్, బి.వేణు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement