
కామెడీ, రియాలిటీ షోలతో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ.. రాజమండ్రి గోదావరి నదిలో అస్థికలు కలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేసి భావోద్వేగానికి గురైంది. జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటానని రాసుకొచ్చింది.
సాధారణంగా సొంతవాళ్లు చనిపోతే వారి అస్థికలని కుటుంబ సభ్యులు.. పుణ్య నదులు, సముద్రాల్లో కలుపుతూ ఉంటారు. కానీ యాంకర్ రష్మీ మాత్రం తన పెంపుడు కుక్క చుట్కీ అస్థికలని రాజమండ్రి దగ్గరున్న గోదావరిలో కలిపింది.
(ఇదీ చదవండి: స్టార్ హీరోలని చిక్కుల్లో పడేసిన గుట్కా యాడ్)

తాను ఎంతగానే ప్రేమించిన శునకానికి కన్నీటి వీడ్కోలు పలికింది. ఈ మేరకు ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేసింది. 'జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటా. మరో జన్మంటూ ఉంటే నువ్వు బాధలేకుండా పుడతావని కోరుకుంటున్నాను. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినందుకు నన్ను క్షమించు. ప్రశాంతంగా వెళ్లు చుట్కీ గౌతమ్' అని రాసుకొచ్చింది.
ఇకపోతే రష్మీకి కుక్కలంటే చాలా ఇష్టం. లాక్ డౌన్ లో వీధి కుక్కల తనవంతు సాయంగా ఆహారం పెట్టింది. పలు శునకాల్ని కూడా పెంచుకుంటోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ కుక్కల గురించి పోస్టులు పెడుతూ ఉంటుంది.
(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా)

Comments
Please login to add a commentAdd a comment