టైటిల్ : పీయస్‌వీ గరుడ వేగ 126.18ఎమ్
జానర్ : యాక్షన్ థ్రిల్లర్
తారాగణం : రాజశేఖర్, పూజా కుమార్, కిశోర్, అదిత్ అరుణ్, నాజర్, పోసాని కృష్ణమురళీ
సంగీతం : శ్రీచరణ్ పాకల, భీమ్స్
దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
నిర్మాత : ఎమ్. కోటేశ్వర రాజు, మురళీ శ్రీనివాస్
చాలా కాలంగా సరైన హిట్‌కోసం ఎదురుచూస్తున్న సీనియర్ హీరో రాజశేఖర్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పీయస్‌వీ గరుడ వేగ 126.18ఎమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గుంటూరు టాకీస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో గరుడ వేగను తెరకెక్కించారు. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఉన్న రాజశేఖర్ సక్సెస్ సాధించారా..?(సాక్షి రివ్యూస్) తొలిసారిగా భారీ బడ్జెట్ చిత్రాన్ని డీల్ చేసి దర‍్శకుడు ప్రవీణ్ సత్తారు ఏమేరకు ఆకట్టుకున్నారు.
కథ :
చంద్రశేఖర్ (రాజశేఖర్) నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో అసిస్టెంట్ కమిషనర్. తన ఉద్యోగం సంగతి భార్యతో కూడా చెప్పుకోలేని శేఖర్, తన మిషన్స్ కారణంగా తరుచు భార‍్య స్వాతి(పూజా కుమార్)తో గొడవ పడుతుంటాడు. ఇక ఉద్యోగం వద్దు అనుకొని రాజీనామ చేసే సమయంలో ఓ కేసు శేఖర్ దగ్గరకు వస్తుంది. నిరంజన్ (అదిత్ అరుణ్) తన దగ్గర ఉన్న ఓ ఇన్ఫర్మేషన్‌ను ప్రతిపక్షనాయకుడు ప్రతాప్ రెడ్డి(పోసాని కృష్ణమురళీ)కి బేరం పెడతాడు. పది కోట్లకు ఆ ఇన్ఫర్మెషన్ ఇచ్చేందుకు ఒప్పుకున్న నిరంజన్ చివరి నిమిషంలో శేఖర్‌కి దొరికిపోతాడు. కానీ ఎన్‌ఐఏ కస్టడీలో ఉండగానే నిరంజన్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ శత్రువు చేతికి వెళ్లిపోతుంది.(సాక్షి రివ్యూస్) అసలు నిరంజన్ దగ్గర ఉన్న సమాచారం ఏంటి..? ఆ సమాచారంతో ప్రతాప్ రెడ్డి పనేంటి..? అనుకున్నట్టుగా ఆ ఇన్ఫర్మేషన్ ప్రతాప్‌రెడ్డికి చేరిందా..? ఈ మిషన్ తో క్రిమినల్ జార్జ్ కు సంబంధం ఏంటి..?
నటీనటులు :
తనకు బాగా అలవాటైన పోలీస్‌రోల్‌లో రాజశేఖర్ మరోసారి అద్భుతంగా నటించి మెప్పించారు. గతంలో పోలీస్‌రోల్స్‌తో ఆకట్టుకున్న రాజశేఖర్ సరైన పాత్ర దొరికితే మరోసారి సత్తా చాటగలనని నిరూపించుకున్నారు. హీరోయిన్ గా నటించిన పూజా కుమార్ పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. రాజశేఖర్ టీం మెంబర్స్ గా చరణ్ దీప్, రవివర్మలు తమ పాత్రకు న్యాయం చేశారు. పోసాని కృష్ణమురళీ రాజకీయనాయకుడి పాత్రలో మరోసారి అలరించగా, అలీ, 30 ఇయర్స్ పృధ్వీ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. కీలక పాత్రలో నటించిన అదిత్ అరుణ్ ఈ సినిమాతో మంచి మార్కులు సాధించాడు. గత చిత్రాల్లో లవర్ బాయ్ లుక్స్‌లో కనిపించిన అదిత్ ఈ సినిమాతో డిఫరెంట్ ఇమేజ్ సంపాదించుకున్నాడు.(సాక్షి రివ్యూస్) విలన్ పాత్రలో నటించిన కిశోర్ లుక్స్ పరంగా ఆకట్టుకున్నా.. పెద్దగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న పాత్ర కాకపోవటం నిరాశకలిగిస్తుంది. ఇతర పాత్రల్లో శ్రద్దాదాస్, షియాజీ షిండే, శత్రులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు :
రాజశేఖర్ ను తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కించే బాధ్యతను తీసుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు అనుకున్న విజయం సాధించారు. యాక్షన్ థ్రిల్లర్‌కు కావాల్సిన పర్ఫెక్ట్ కథను రెడీ చేసుకున్న దర్శకుడు అదే స్థాయి టేకింగ్ తో అలరించాడు. పూర్తిగా టెక్నాలజీ, మైండ్ గేమ్ కు సంబందించిన అంశాలతో కథను నడిచిన ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా తెరకెక్కించటంలో సక్సెస్ సాధించారు. అయితే సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడా కథ స్లో అయినట్టుగా అనిపించినా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్, అన్నింటినీ కవర్ చేసేస్తాయి. సినిమాకు మరో మేజర్ ఎసెట్ సంగీతం. భీమ్స్ కంపోజ్‌చేసిన రెండు పాటలు బాగున్నాయి.(సాక్షి రివ్యూస్) శ్రీచరణ పాకల అందించిన నేపథ్యం సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమాటోగ్రఫి సినిమా మూడ్ ను క్యారీ చేసేలా ఉంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్, నైట్ ఎఫెక్ట్ లో తీసిన సీన్స్ సూపర్బ్‌గా వచ్చాయి. సన్నిలియోన్ స్పెషల్‌సాంగ్ మాస్ ఆడియన్స్ ను అలరిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
రాజశేఖర్ నటన
కథా కథనం
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ :
రొటీన్ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చే మసాలా ఎలిమెంట్స్ లేకపోవటం
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment