గరుడవేగ దర్శకుడితో తమిళ హీరో | Praveen Sattaru Wants To Make Movie With Dhanush | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 7 2018 1:52 PM | Last Updated on Thu, Jun 7 2018 2:00 PM

Praveen Sattaru Wants To Make Movie With Dhanush - Sakshi

రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ గరుడవేగ. చాలా కాలం తరువాత రాజశేఖర్‌ కు సక్సెస్‌ అంధించిన ఈ సినిమాతో దర్శకుడు ప్రవీన్‌ సత్తారు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. గరుడవేగ సక్సెస్‌తరువాత చాలా మంది హీరో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించేందుకు ముందుకు వచ్చారు. అయితే ప్రవీణ్ సత్తారు ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో రామ్‌ హీరోగా సినిమాను తెరకెక్కించాలని భావించాడు. కానీ బడ్జెట్‌ సమస్యల కారణంగా ఈ సినిమా ఇంకా సెట్స్‌ మీదకు రాలేదు.

ఇప్పుడు ఇదే సినిమాను తమిళ స్టార్‌ మీరో ధనుష్‌ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట ప్రవీణ్‌ సత్తారు. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించాల్సిన ఈ సినిమా ధనుష్‌ తో అయితే మార్కెట్ పరంగా ఎలాంటి రిస్క్‌ ఉండదని భావిస్తున్నాడట. ఇప్పటికే ధనుష్‌కు కథ కూడా వినిపించాడని.. సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రాజశేఖర్‌ కీలక పాత్రలో నటించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement