
సాక్షి, సినిమా : సినీ ఇండస్ట్రీలో హిట్‌పెయిర్‌కు భలే క్రేజ్ ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుందని అందుకే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారని అంటారు. ఒక వేళ సినిమా ఆడకపోతే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరలేదని విమర్శిస్తారు. హీరో రామ్, హీరోయిన్ కాజల్ తీసిన గణేశ్ సినిమా విజయం సాధించకపోయేసరికి వీరిరువురు కలిసి మరో సినిమా తీయలేదు. ఫ్లాప్ కాంబినేషన్ కావటంతో దర్శక నిర్మాతలు ఈ కాంబినేషన్‌ను రిపీట్ చేసే ప్రయత్నం చేయలేదు.
కానీ ఎనిమిదేళ్ల తర్వాత రామ్, కాజల్‌లు కలిసి నటించనున్నారు. గరుడవేగతో విజయం సాధించిన ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వీరు హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభకానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్ర పూర్తి వివరాలను యూనిట్ సభ్యులు త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రవీణ్ సత్తార్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
చాలా గ్యాప్ తర్వాత తొలి అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్‌రామ్‌తో ఎమ్మెల్యేలో నటించిన కాజల్.. ఇప్పటికే సినిమా లుక్స్ అందరినీ ఆకట్టుకోగా, ఇప్పుడు మరో సినిమాలో ఎనిమిదేళ్ల తర్వాత రామ్ సరసన నటించనుంది. మరి ఈ సినిమాతోనైనా హిట్ జోడిగా పేరు తెచ్చుకుంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment