
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్. అయితే ఈ సినిమా ఆగిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. కానీ... ‘‘జూన్ మొదటివారంలో మా సినిమా చిత్రీకరణ మొదలవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొనడంతో ప్రచారంలో ఉన్న వార్త నిజం కాదని స్పష్టం అయింది.
చిత్రీకరణకు తగ్గ ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో ఉన్నారు ప్రవీణ్ సత్తారు. అలాగే కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘బంగార్రాజు’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కాల్సి ఉంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోని సినిమా పూర్తయ్యాక ‘బంగార్రాజు’ ఆరంభం అవు తుందట.
Comments
Please login to add a commentAdd a comment