చాలా కాలం తరువాత సీనియర్ హీరో రాజశేఖర్ ‘పీఎస్‌వీ గరుడవేగ 126.18 ఎం’ సినిమాతో ఘనవిజయం సాధించారు. ఈ సక‍్సెస్ తరువాత సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు యాంగ్రీ హీరో. కేవలం హీరోగానే కాకుండా కీలకమైన పాత్రల్లో నటించేందుకు అంగీకరిస్తున్నారు. గతంలో ధృవ సినిమాలో రాజశేఖర్ విలన్‌గా నటించాల్సి ఉన్న అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు మరో యంగ్ హీరో సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించేందుకు రాజశేఖర్ అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
యంగ్ హీరో రామ్ తన తదుపరి చిత్రాన్ని గరుడవేగ సినిమాతో ఘనవిజయం సాధించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఇటీవల ప్రారంభించారు. శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ విలన్‌గా నటిస్తున్నారట. తనకు హీరోగా మంచి బ్రేక్ ఇచ్చిన ప్రవీణ్ కోరటంతో రాజశేఖర్ ప్రతినాయక పాత్రకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను జార్జియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలలో చిత్రీకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment