సంక్రాంతికి గరుడవేగ, గరుడబజార్లలో డిస్కౌంట్లు | garudavega and garudabazar announce pongal discounts | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి గరుడవేగ, గరుడబజార్లలో డిస్కౌంట్లు

Published Wed, Jan 7 2015 5:35 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

garudavega and garudabazar announce pongal discounts

కొత్త సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా గరుడబజార్ ఉత్పత్తులన్నింటి మీద 5%, గరుడవేగ షిప్మెంట్ల మీద 10% డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆ సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి. కొత్త సంవత్సరంతో గరుడవేగ ఆపరేషన్లు ప్రారంభమై ఐదేళ్లు అవుతుందని, తమ సేవల నాణ్యతకు ఇదే సిసలైన నిదర్శనమని ఆ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు తమపై ఉన్న నమ్మకం, వారి మద్దతుతోనే ఇదంతా సాధ్యమైందన్నారు.

అందుకు కృతజ్ఞతగా ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల నుంచి గరుడవేగ ద్వారా 5 కిలోలు, అంతకంటే ఎక్కువగా చేసే షిప్మెంట్లకు ఈనెల 20వ తేదీ వరకు 10 శాతం డిస్కౌంట్ ప్రటిస్తున్నామని తెలిపారు. ఇక సంక్రాంతి సందర్భంగా విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు కూడా పండుగ సంబరాలను ఇంటికి తెచ్చుకుంటారని, ప్రధానంగా ఈ పండుగకు రుచికరమైన స్వీట్లు తమ జన్మభూమి నుంచి తెప్పించుకుంటారని అన్నారు. అందుకోసం గరుడబజార్లో కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, డిజైనర్ గాజులు, ప్రత్యేకమైన స్వీట్లు తెప్పించామన్నారు. స్వగృహ, పుల్లారెడ్డి, వెల్లంకి.. తదితర బ్రాండ్ల స్వీట్లు సిద్దంగా ఉన్నాయని, వాటిమీద 5% డిస్కౌంట్ ఇస్తున్నామని తెలిపారు.

LikeUS @ https://www.facebook.com/Garudabazaar
LikeUs @ https://www.facebook.com/garudavega2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement