గరుడవేగా, గరుడ బజార్‌ దీపావళి ధమాకా! | GarudaVega GarudaBazaar deliver to all countries for Diwali Offers | Sakshi
Sakshi News home page

గరుడవేగా, గరుడ బజార్‌ దీపావళి ధమాకా!

Published Thu, Oct 20 2016 12:25 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

గరుడవేగా, గరుడ బజార్‌ దీపావళి ధమాకా!

గరుడవేగా, గరుడ బజార్‌ దీపావళి ధమాకా!

అంతర్జాతీయంగా లాజిస్టిక్ బ్రాండ్ డెలివరీ సేవలు అందిస్తున్న విశిష్ట సంస్థ 'గరుడ వేగా' దీపావళి సందర్భంగా సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. తమ వినియోగదారులకోసం గొప్ప ఆఫర్లను తీసుకొచ్చింది. విదేశాల్లో ఉంటున్న తమ వారికి ఇష్టమైన వస్తువులను పంపించేందుకు డెలివరీ చార్జీల్లో 20 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. దీపావళి' కూపన్ కోడ్ ఉపయోగించి మరో 5 శాతం కూడా డిస్కౌంట్ పొందవచ్చని గరుడ వేగా తెలిపింది. ఇప్పటికే ఇతర దేశాల్లో కూడా డెలివరీ సర్వీసులను అందిస్తున్న గరుడ వేగా ఇప్పుడు  యూవీఈలోని పలు ప్రాంతాలకు కూడా తన సేవలు మరింత విస్తృతం చేయనుంది. ఇందులో భాగంగా అమెరికాలోని ఆలయాల్లో అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత్ నుంచి వెండి వస్తువులను కూడా డెలివరీ చేయడం ప్రారంభించింది.

వినాయక చతుర్ధి సందర్భంగా అమెరికాలో ప్రఖ్యాత దేవాలయాలకు 10 అడుగుల గణేషుని ప్రతిమలు, 100 కేజీల లడ్డూలను డెలవరీ చేసినట్టు పేర్కొంది. దీంతోపాటు ఇదే సంస్థకు చెందిన గరుడా బజార్ ద్వారా బహుమతులు, స్నాక్స్, పచ్చళ్లు మొదలైనవాటిని కూడా చేరవేస్తోంది. గరుడబజార్లో కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, డిజైనర్ గాజులు, స్వగృహ, పుల్లారెడ్డి, వెల్లంకి.. తదితర బ్రాండ్ల స్వీట్లు సిద్దంగా ఉన్నాయని సంస్థ తెలిపింది. ముఖ్యంగా దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలకే డెలీవరి సర్వీసులను అందిస్తున్నట్టు గరుడవేగా పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement