అంతర్జాతీయంగా లాజిస్టిక్ బ్రాండ్ డెలివరీ సేవలు అందిస్తున్న విశిష్ట సంస్థ 'గరుడ వేగా' ఉగాది సందర్భంగా సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. తమ వినియోగదారులకోసం గొప్ప ఆఫర్ తీసుకొచ్చింది. విదేశాల్లో ఉంటున్న తమ వారికి ఇష్టమైన వస్తువులను పంపించేందుకు డెలివరీ చార్జీల్లో 20శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. 'UGADI' కూపన్ కోడ్ ఉపయోగించి మరో 5 శాతం కూడా డిస్కౌంట్ పొందవచ్చని గరుడ వేగా తెలిపింది.
ఇప్పటికే ఇతర దేశాల్లో కూడా డెలివరీ సర్వీసులను అందిస్తున్న గరుడ వేగా ఇప్పుడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా తన సేవలు మరింత విస్తృతం చేయనుంది. ఇందులో భాగంగా అమెరికాలోని ఆలయాల్లో అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత్ నుంచి వెండి వస్తువులను కూడా డెలివరీ చేయడం ప్రారంభించింది. దీంతోపాటు ఇదే సంస్థకు చెందిన గరుడా బజార్ ద్వారా బహుమతులు, స్నాక్స్, పచ్చళ్లు మొదలైనవాటిని కూడా చేరవేయనుంది. గరుడబజార్లో కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, డిజైనర్ గాజులు, స్వగృహ, పుల్లారెడ్డి, వెల్లంకి.. తదితర బ్రాండ్ల స్వీట్లు సిద్దంగా ఉన్నాయని సంస్థ తెలిపింది. ముఖ్యంగా ఉగాది పండుగను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలకే డెలీవరి సర్వీసులను అందించనుంది.
ఉగాదికి 'గరుడ వేగా' భారీ డిస్కౌంట్లు
Published Sat, Apr 2 2016 6:42 PM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM
Advertisement
Advertisement