సాక్షి, హైదరాబాద్ : హీరో రాజశేఖర్ కరోనాను జయించారు. సోమవారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ఇటీవల రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారంతా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అయితే ఆయన భార్య జీవిత, కూతుళ్లు శివానీ, శివాత్మిక త్వరగా ఈ మహమ్మారి నుంచి బయట పడగా.. రాజశేఖర్ ఆరోగ్యం మాత్రం కాస్త క్షీణించింది. దీంతో ఆయన అభిమానులంతా ఆందోళనకు గురయ్యారు.
(చదవండి : చిరంజీవికి కరోనా పాజిటివ్)
గత కొద్దీ రోజులుగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతూ వస్తుంది. ఆయన ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా రాజశేఖర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నెగిటివ్ రావడంతో ఆయన తిరిగి ఆరోగ్యంగా ఉండటంతో డిశ్చార్జ్ చేసారు. ఈ విషయాన్నీ రాజశేఖర్ సతీమణి జీవిత తెలిపారు. మెదట్లో ఆయన ఆరోగ్యం చలా క్రిటికల్ స్టేజికి వెళ్లిందని, వైద్యులు తీవ్రంగా కృషి చేసి ఆయనను కాపాడరని జీవిత అన్నారు. ఆయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకున్న అభిమానులందరికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు.
Jeevitha Rajasekhar thanked Doctors and medical staff of City Neuro Centre for their support during the treatment @ActorRajasekhar pic.twitter.com/Klkjj6CGJe
— BARaju (@baraju_SuperHit) November 9, 2020
Comments
Please login to add a commentAdd a comment