మాట్లాడుతున్న మర్రి రాజశేఖర్
చిలకలూరిపేట టౌన్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి దమ్ముంటే సీబీసీఐడీ విచారణకు సిద్ధంగా ఉండాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ సవాలు విసిరారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సీసీఐ కుంభకోణం, యడవల్లి దళిత భూముల అన్యాక్రాంతం, ఇద్దరు విలేకరుల హత్య, ఆత్యహత్యా ఉదంతాలు, నీరు–చెట్టు పథకంలో భాగంగా దళిత భూముల ఆక్రమణ, చెరువుల మట్టి అమ్ముకోవటం, యడ్లపాడులో అక్రమ గ్రావెల్ తవ్వకం, అగ్రిగోల్డ్ భూముల కొనుగోళ్లు, మద్యం వ్యాపారులు, బాణాసంచ వ్యాపారుల నుంచి భారీ ఎత్తున బలవంతపు వసూళ్లు, సిటీ కేబుల్ ఆపరేటర్ల ఆస్తుల స్వాధీనం, సీఆర్ క్లబ్‌లో పేకాట వ్యవహారం, స్వర్ణాంధ్ర పౌండేషన్‌కు నిధుల మళ్లింపు వంటి వాటిపై సీబీసీఐడీ, లేదా సీబీఐ విచారణకు పుల్లారావు సిద్ధమా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం, అడ్డువచ్చిన వారిపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. పుల్లారావు సతీమణి రాజ్యాంగేతర శక్తిగా మారారన్నారు. అంగన్ వాడీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, మైత్రి సంఘాలు, బంగారపు దుకాణాల నిర్వాహకుల నుంచి పెద్ద ఎత్తున అక్రమ వసుళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment