జింఖానా, న్యూస్‌లైన్: అంతర్ కళాశాలల తైక్వాండో చాంపియన్‌షిప్ పురుషుల 87 కేజీల విభాగంలో ఏవీ కాలేజి విద్యార్థిరాజశేఖర్ స్వర్ణ పతకం సాధించగా, కిరణ్ కుమార్ (అరోరా కాలేజి) కాంస్యంతో సంతృప్తిపడ్డాడు. బుధవారం జరిగిన ఈ పోటీల్లో 80 కేజీల కేటగిరీలో కిరణ్, సాయి కిరణ్ (అవంతి కాలేజి) వరుసగా స్వర్ణం, రజతం గెలిచారు. నిఖిల్ (అరోరా) కాంస్యం దక్కించుకున్నాడు.
74 కేజీల విభాగంలో నరసింహ (పల్లవి కాలేజి) స్వర్ణ పతకాన్ని, నవీన్ (అరోర) కాంస్య పతకాన్ని సాధించారు. విజేతలకు ఓయూ ఐసీటీ కార్యదర్శి డాక్టర్ బి. సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు.
ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
54 కేజీ: 1. ప్రదీప్ కుమార్ (అరోర), 2. రవి (అవంతి), 3. విక్రమ్, 4. లాలూ ప్రసాద్ (ఎస్‌ఏపీ కాలేజి).
58 కేజీ: 1. నరేష్ (ఎస్‌ఏపీ కాలేజి), 2. హర్ష (అరోరా), 3. భరత్ (మహూబియా కాలేజి).
63 కేజీ: 1. గోవింద్ శర్మ (భవాన్స్), 2. సుధీర్ (అవంతి), 3. సంతోష్ కుమార్ (వెస్లీ కాలేజి), 4. సాయి కిరణ్ (అరోరా).
68 కేజి: 1. ప్రవీన్ (ఏవీ కాలేజి), 2. మహేష్ (అరోరా), 3. మహేందర్ (అవంతి), 4. నిరుపమ్ రెడ్డి (పీజీ లా కాలేజి).
రాజశేఖర్‌కు స్వర్ణం
Published Thu, Feb 6 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
Advertisement
Advertisement