ఎక్స్‌ట్రార్డినరీ సాంగ్‌ | Extraordinary Man: Nithiin and Sreeleela song shooting at Hyderabad | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ట్రార్డినరీ సాంగ్‌

Published Thu, Nov 23 2023 4:49 AM | Last Updated on Thu, Nov 23 2023 4:49 AM

Extraordinary Man: Nithiin and Sreeleela song shooting at Hyderabad - Sakshi

ఎక్స్‌ట్రార్డినరీ లెవల్‌లో డ్యాన్స్‌ చేశారు నితిన్‌. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీ మ్యాన్‌’. రాజశేఖర్‌ ఓ కీలక పాత్రధారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ శివార్లలో జరుగుతోంది. ఓ భారీ సెట్‌లో 300 మందికి పైగా ఫారిన్‌ డ్యాన్సర్స్‌తో జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీలో నితిన్, శ్రీలీలపై ఓ మాస్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.

ఈ పాటతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవు తుందని, మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని యూనిట్‌ పేర్కొంది. శ్రేష్ఠ్‌ మూవీస్, ఆదిత్యా మూవీస్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై ఎన్‌. సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 8న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: హ్యారిస్‌ జైరాజ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement