మరో తెలుగు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే సంక్రాంతి సందర్భంగా ఈ వీకెండ్‌లోనే వచ్చేస్తుందని ఓటీటీల్లోకి వస్తుందన‍్నారు గానీ ఇప్పుడు ఆ తేదీ మారిపోయింది. ఊహాగానాలకు తెరదించుతూ అధికారిక ప్రకటన వచ్చేసింది. దీంతో మూవీ లవర్స్ షో వేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎప్పుడు ఓటీటీలోకి రాబోతుంది?
(ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?)
ఈ మధ్య శ్రీలీల జోరు గట్టిగా కనిపిస్తోంది. వరసపెట్టి మూవీస్ చేస్తూనే ఉంది. అలానే నితిన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' మూవీలో హీరోయిన్‌గా చేసింది. కామెడీ ఎంటర్‌టైనర్ స్టోరీతో తీసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కథలో పస లేకపోవడంతో పాటు పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా లేని సీన్స్ వల్ల ఆడియెన్స్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు.
ఇకపోతే డిసెంబరు 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది. అయితే ఇప్పటికే నెలరోజులు దాటిపోవడంతో ఈసారి సంక్రాంతి కానుకగా జనవరి 12న లేదా 13న రిలీజ్ చేస్తారని తొలుత టాక్ వినిపించింది. కానీ అది నిజం కాదని తేలింది. అయితే జనవరి 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇప్పుడు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో నెక్స్ట్ వీకెండ్ చూడటానికి ఓ మూవీ సెట్ అయిపోయిందని.. సినీ ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ)
Get ready to experience all the shades of this extraordinary man ✨🫶🏽#ExtraOrdinaryManonHotstar Streaming from 19th Jan only on #DisneyPlusHotstar@actor_nithiin @ActorRajasekhar @sreeleela14 @vamsivakkantham@Jharrisjayaraj pic.twitter.com/HzL4Se8OEY
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) January 13, 2024
Comments
Please login to add a commentAdd a comment