
యాక్షన్ హీరో జాకీచాన్ నటించిన తాజా చిత్రం ‘ది ఫారినర్’. 1992లో స్టీఫెన్ లీథర్ రచించిన ‘ద చైనామ్యాన్’ నవల ఆధారంగా మార్టిన్ కాంపెబెల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ నెల 13న విడుదల కానుంది. నక్షత్ర మీడియా పతాకంపై నక్షత్ర రాజశేఖర్ సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘లండన్‌లో హంబుల్ బిజినెస్‌మేన్‌గా హీరో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. ఉగ్రవాదుల దాడుల్లో అతని కూతురు చనిపోతుంది. ఇందుకు కారణమైన వారిని హీరో టార్గెట్ చేసి, తన ప్రతీకారం తీర్చుకోవడమే సినిమా. యాక్షన్ ఎపిసోడ్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. జాకీచాన్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఖాసీం, ఎమ్. రాజశేఖర్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment