jocky chan
-
జాకీ పంపిన జాకెట్
బహుమతులు ఎవరికైనా ప్రత్యేకమే. అసలు కానుకలు ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఇప్పుడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కి కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. దాంతో చెప్పలేనంత సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఏంటా గిఫ్ట్? ఎవరు పంపిందంటే.. స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ జాకెట్. ఇంటర్నేషనల్ యాక్షన్ హీరో జాకీ చాన్ పంపించారు. వీళ్లిద్దరికీ స్నేహం ఎలా కుదిరిందబ్బా? అంటే గతేడాది వచ్చిన ‘కుంగ్‌ఫూ యోగా’ సినిమాలో వీళ్లిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. అప్పటి నుంచి వీళ్ల ఇండో– చైనీస్ మైత్రీ కుదిరింది. గిఫ్ట్‌తో పాటు సోనూసూద్‌కు ఒక లెటర్ కుడా రాశారు జాకీ చాన్. ఆ లేఖ సారాంశం ఏంటంటే... ‘‘మై డియర్ సోనూ..., ఈ జాకెట్ ‘జేసి స్టంట్ టీమ్’ 40వ వార్షికోత్సవం సందర్భంగా తయారు చేసిన స్పెషల్ ఎడిషన్ లిమిటెడ్ జాకెట్. ఈ జాకెట్ కోసం వాడిన లెదర్‌ని స్వయంగా సెలెక్ట్ చేసి, బెస్ట్ తయారీదారుడి దగ్గర నా అభిరుచికి తగ్గటు డిజైన్ చేయించాను. ఈ జాకెట్‌ని నువ్వు తీక్షణంగా పరిశీలిస్తే అందులో కనిపించే ప్రతీ డీటైల్లోనూ, డిజైనింగ్‌లోనూ నేనే స్వయంగా కనిపిస్తాను. ఈ జాకెట్ వెల ఎంతో చెప్పలేను కానీ విలువ మాత్రం నిజాయితీగా చెప్పాలంటే అందులో నా ఆలో^è నలు ప్రతిబింబిస్తాయి. నాతో పాటు నా జర్నీలో కష్ట సుఖాల్లో నడిచిన నా సోదరులకు మాత్రమే కాకుండా నీలాంటి ఆప్తులకు ఇవ్వాలనుకున్నాను. ఈ చిరు కానుక నీకు చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దాన్ని చూసినప్పుడల్లా నా గురించి ఆలోచిస్తావు, దాన్ని ధరించినప్పుడల్లా నన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుంది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ∙సోనూకి జాకీ పంపించిన జాకెట్ -
ఉగ్రవాదులపై ప్రతీకారం
యాక్షన్ హీరో జాకీచాన్ నటించిన తాజా చిత్రం ‘ది ఫారినర్’. 1992లో స్టీఫెన్ లీథర్ రచించిన ‘ద చైనామ్యాన్’ నవల ఆధారంగా మార్టిన్ కాంపెబెల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ నెల 13న విడుదల కానుంది. నక్షత్ర మీడియా పతాకంపై నక్షత్ర రాజశేఖర్ సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘లండన్‌లో హంబుల్ బిజినెస్‌మేన్‌గా హీరో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడు. ఉగ్రవాదుల దాడుల్లో అతని కూతురు చనిపోతుంది. ఇందుకు కారణమైన వారిని హీరో టార్గెట్ చేసి, తన ప్రతీకారం తీర్చుకోవడమే సినిమా. యాక్షన్ ఎపిసోడ్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. జాకీచాన్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ఖాసీం, ఎమ్. రాజశేఖర్ రెడ్డి. -
జాకీచాన్ రేంజ్లో వడివేలు ఫైట్
చెన్నై: వడివేలు అని పేరు వింటుండగానే చటుక్కున మన ముఖాల్లో నవ్వులు విరబూస్తుంటాయి. స్వతహాగా తమిళ హాస్య నటుడు అయినప్పటికీ తెలుగులో కూడా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాల్లో ఆయన భాష పలికే తీరు, ఆ సమయంలో హావభావాలు కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తాయి. అయితే, ఎప్పుడూ నవ్వించే ఆయన ఈసారి మాత్రం ఔరా అని అనిపించనున్నారు. ఎందుకంటే ఆయన కూడా ఈసారి హీరోల మాదిరిగా గాల్లో ఎగురుతూ ఫైట్ చేయనున్నారు. అవి అలాంటిఇలాంటి పోరాటాలు కాదు.. ఏకంగా జాకీచాన్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉండేలా ఆయన ఫైట్ చేయబోతున్నారు. ఎప్పుడూ తనను హాస్య నటుడుగానే చూసే ప్రేక్షకులు ఫైట్ చేసే హీరోగా చూడలేరని, తాను ఈసీన్ చేయలేనని చెప్పినా.. డైరెక్టరే స్వయంగా పట్టుబట్టి మరీ ఈ సీన్ చేయిస్తున్నారట. ఈ విషయాన్ని చిత్ర డైరెక్టర్ యువరాజ్ స్వయంగా చెప్పారు. గత కొన్ని రోజులుగా తెరమరుగైనా వడివేలు ఇప్పుడు 'ఎలి' అనే తమిళ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆ చిత్రంలోనే ఈ పైట్లు కనిపించబోతున్నాయి.