జాకీ పంపిన జాకెట్‌ | Jackie Chan surprises Sonu Sood by sending a limited edition jacket and a personalised handwritten note | Sakshi
Sakshi News home page

జాకీ పంపిన జాకెట్‌

Published Fri, Mar 23 2018 12:12 AM | Last Updated on Fri, Mar 23 2018 12:12 AM

Jackie Chan surprises Sonu Sood by sending a limited edition jacket and a personalised handwritten note - Sakshi

బహుమతులు ఎవరికైనా ప్రత్యేకమే. అసలు కానుకలు ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. ఇప్పుడు బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌కి కూడా ఒక స్పెషల్‌ గిఫ్ట్‌ వచ్చింది. దాంతో చెప్పలేనంత సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఏంటా గిఫ్ట్‌? ఎవరు పంపిందంటే.. స్పెషల్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ జాకెట్‌. ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ హీరో జాకీ చాన్‌ పంపించారు. వీళ్లిద్దరికీ స్నేహం ఎలా కుదిరిందబ్బా? అంటే గతేడాది వచ్చిన ‘కుంగ్‌ఫూ యోగా’ సినిమాలో వీళ్లిద్దరూ కలిసి యాక్ట్‌ చేశారు. అప్పటి నుంచి వీళ్ల ఇండో– చైనీస్‌ మైత్రీ కుదిరింది. గిఫ్ట్‌తో పాటు సోనూసూద్‌కు ఒక లెటర్‌ కుడా రాశారు జాకీ చాన్‌. ఆ లేఖ సారాంశం ఏంటంటే...


‘‘మై డియర్‌ సోనూ..., ఈ జాకెట్‌ ‘జేసి స్టంట్‌  టీమ్‌’ 40వ వార్షికోత్సవం సందర్భంగా తయారు చేసిన స్పెషల్‌ ఎడిషన్‌ లిమిటెడ్‌ జాకెట్‌. ఈ జాకెట్‌ కోసం వాడిన లెదర్‌ని స్వయంగా సెలెక్ట్‌ చేసి, బెస్ట్‌ తయారీదారుడి దగ్గర నా అభిరుచికి తగ్గటు డిజైన్‌ చేయించాను. ఈ జాకెట్‌ని నువ్వు తీక్షణంగా పరిశీలిస్తే అందులో కనిపించే ప్రతీ డీటైల్‌లోనూ, డిజైనింగ్‌లోనూ నేనే స్వయంగా కనిపిస్తాను. ఈ జాకెట్‌ వెల ఎంతో చెప్పలేను కానీ విలువ మాత్రం నిజాయితీగా చెప్పాలంటే అందులో నా ఆలో^è నలు ప్రతిబింబిస్తాయి. నాతో పాటు నా జర్నీలో కష్ట సుఖాల్లో నడిచిన నా సోదరులకు మాత్రమే కాకుండా నీలాంటి ఆప్తులకు ఇవ్వాలనుకున్నాను. ఈ చిరు కానుక నీకు చలికాలంలో వెచ్చదనాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దాన్ని చూసినప్పుడల్లా నా గురించి ఆలోచిస్తావు, దాన్ని ధరించినప్పుడల్లా నన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుంది’’ అని  ఆ లేఖలో పేర్కొన్నారు.
∙సోనూకి జాకీ పంపించిన జాకెట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement