
సమంత ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చిన సామ్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది. ఇప్పుడైతే కొత్త సినిమాలేవీ సైన్ చేయట్లేదట. కానీ వీలైనంత త్వరగా ఖుషీ సినిమా మాత్రం పూర్తి చేయాలని భావిస్తుందట. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే సమంతకు హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఓ పవర్‌ఫుల్ మెసేజ్ ఉన్న ఓ స్పెషల్ గిఫ్ట్‌ను పంపాడు. అందులో ఏముందంటే.. ''చీకటితో కూడిన సొరంగం..వెలుతురు ఆనవాళ్లు కూడా లేవు. అడుగులు భారంగా మారినా శక్తినంతా కూడదీసుకుని ముందుకు సాగుతావు. భయాలు, సందేహాలు పక్కనపెట్టి సోల్జర్‌లా మారతావు. ఎందుకంటే నువ్వొక ఉక్కు మనిషివి.
ఈ విజయం నీ జన్మహక్కు. ప్రస్తుతం నీ దారి చీకటిగా ఉండొచ్చు కానీ, త్వరలోనే అది ప్రకాశిస్తుంది. నువ్వొక యోధురాలివి, నిన్ను ఏదీ ఓడించలేదు. ఇలాంటివి నిన్ను ఇంకా బలపడేలా చేస్తాయని, ఎప్పటికీ బలంగా ఉండేలా చేస్తాయి'' అంటూ స్ట్రాంగ్ మెసేజ్‌తో కూడిన ఫలకాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసి ఎమోషనల్ అయిన సమంత థ్యాంక్యూ అంటూ ఈ ఫోటోను షేర్‌చేసింది.
Comments
Please login to add a commentAdd a comment