రామ్‌చరణ్-ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. పెళ్లైన 11 ఏళ్లకు ఉపాసన తొలిసారి గర్బం దాల్చింది. దీంతో పుట్టబోయే బిడ్డ కోసం మెగా ఫ్యామిలీ సహా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఉపాసన ఎక్కువగా భర్తతో వెకేషన్‌కు వెళ్తూ సమయం గడుపుతుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది.
ఇటీవలె బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఉపాసన కోసం ఓ క్యూట్ బహుమతిని పంపించింది. ప్రస్తుతం ఆలియా Ed-a-Mamma నుంచి అనే క్లోతింగ్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ఆమె ఎన్టీఆర్ పిల్లలకు దుస్తులు పంపించింది.
తాజాగా ఉపాసనకు, పుట్టబోయే బేబీకి సంబంధించిన దుస్తులను పంపించింది. ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆలియాకు థ్యాంక్స్ చెప్పింది. కాగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఆలియా భట్ రామ్‌చరణ్ సరసన నటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment