IPL 2022: Mumbai Indians Won Cricket Fan Hearts Special Holi Gift 9 IPL Teams - Sakshi
Sakshi News home page

IPL 2022: కప్‌ గెలుస్తారో లేదో తెలీదు.. మా మనసులు దోచుకున్నారు

Published Fri, Mar 18 2022 9:22 AM | Last Updated on Wed, Mar 23 2022 6:24 PM

Mumbai Indians Won Cricket Fan Hearts Special Holy Gift 9 IPL Teams - Sakshi

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు పొందిన ముంబై ఇండియన్స్‌ తాజా చర్యతో అభిమానుల మనసులు గెలుచుకుంది. కరోనా కారణంగా ఈసారి సీజన్‌ను ముంబై, పూణే వేదికగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. వాంఖడే, డీవై పాటిల్‌, సీసీఐ బ్రబౌర్న్‌  స్టేడియాల్లోనే ఈసారి మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక ఐపీఎల్‌ 15వ సీజన్‌ ఆరంభానికి మరో 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 

ఈ నేపథ్యంలో హోలీ పండుగ పురస్కరించుకొని ముంబై ఇండియన్స్.. ఐపీఎల్‌లో ఉన్న మిగతా 9 జట్లకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. రోహిత్‌ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్‌.. ముంబై రోడ్లలో బిల్‌బోర్డులను ఏర్పాటు చేసి ఆయా ప్రాంచైజీలకు స్వాగతం పలికింది. 9 జట్లకు తొమ్మిది రకాల స్లోగన్స్‌ ఇచ్చి వారిని ఉత్సాహపరుస్తూ వచ్చింది. మరి ముంబై ఇండియన్స్‌ ఇచ్చిన 9 స్లోగన్స్‌ను ఇప్పుడు చూద్దాం. 

రాజస్తాన్‌ రాయల్స్‌- వెల్‌కమ్‌.. హల్లా బోల్‌.. దిల్‌ కోల్‌ కే
ఎస్‌ఆర్‌హెచ్‌- వెల్‌కమ్‌.. షైన్‌ కరో.. దిల్‌ కోల్‌ కే.. దిల్‌ కోల్‌ కే
కేకేఆర్‌- వెల్‌కమ్‌.. కోర్బో..లోర్బో.. జీత్‌బో.. దిల్‌ కోల్‌ కే
లక్నో సూపర్‌ జెయింట్స్‌- వెల్‌కమ్‌.. కేల్‌ నవాబీ.. దిల్‌ కోల్‌ కే
ఢిల్లీ క్యాపిటల్స్‌- వెల్‌కమ్‌.. కేలో ధిల్లీ..దిల్‌ కోల్‌ కే
పంజాబ్‌ కింగ్స్‌- వెల్‌కమ్‌.. చక్‌ దే పత్తే.. దిల్‌ కోల్‌ కే
గుజరాత్‌ టైటాన్స్‌- వెల్‌కమ్‌.. మజా థీ రామ్‌జో.. దిల్‌ కోల్‌ కే
సీఎస్‌కే- వెల్‌కమ్‌.. విజిల్‌ పోడూ.. దిల్‌ కోల్‌ కే
ఆర్‌సీబీ- వెల్‌కమ్‌.. ప్లే బోల్డ్‌.. దిల్‌ కోల్‌ కే


ముంబై ఇండియన్స్‌ చేసిన పనిని క్రికెట్‌ ఫ్యాన్స్‌ తెగమెచ్చుకుంటున్నారు. మీరు కప్‌ గెలుస్తారో లేదో తెలియదు కానీ మా మనసులు మాత్రం గెలిచేశారు.. లవ్‌ యూ ముంబై అంటూ కామెంట్‌ చేశారు. ఇక గత సీజన్‌లో అంతగా ఆకట్టుకోని ముంబై ఇండియన్స్‌ ఈసారి సరికొత్త ప్రణాళికతో బరిలోకి దిగనుంది. ఇక మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తన తొలి మ్యాచ్‌ను మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

చదవండి: PAK vs AUS: 24 ఏళ్ల క్రితం రాళ్లు రువ్వారు.. కట్‌చేస్తే

IPL 2022: 'దీపక్ చాహర్ స్ధానాన్ని భర్తీ చేసే సత్తా అతడికే ఉంది'

Ravichanran Ashwin: ‘రెండో ఆలోచన వద్దు.. రనౌట్‌ చేసేయండి’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement